ఫాస్ట్ ఫుడ్ కాదు వరస్ట్ ఫుడ్.. ఇక్కడ తింటున్నారా!

కలం, వెబ్ డెస్క్: ఎన్నో రోజుల కింద తెచ్చి ఫ్రిజ్‌లో పెట్టిన చికెన్, ఇంజిన్ ఆయిల్ లాంటి నూనె, ఈగలు దోమలతో అపరిశుభ్రంగా మారిన వండే ప్రాంతం, అందులో వాడే పదార్థాలన్నీ గడువు తీరిపోయినవే.. ఇదీ హైదరాబాద్ (Hyderabad) నగరంలో పలు చోట్ల ఫాస్ట్ ఫుడ్ కేంద్రాల్లో (Fast Food Centers) వెలుగు చూస్తున్న భయంకరమైన దృశ్యాలు. తాజాగా, చాంద్రాయణగుట్టలోని అల్ మదీనా, ఒమర్ చైనీస్ ఫాస్ట్ ఫుడ్ కేంద్రాలపై హెచ్-ఫాస్ట్, జీహెచ్‌ఎంసీ ఆహార భద్రతాధికారులు దాడులు చేయగా.. మరోసారి ఇలాంటివే వెలుగు చూశాయి.

ఫుడ్ కలర్స్ వాడుతూ..

ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో (Fast Food Centers) తనిఖీలు చేయగా.. ఏమాత్రం నాణ్యత లేని ఆహార పదార్థాలు బయటపడ్డాయి. 80 కిలోల చికెన్, 20 లీటర్ల నాసిరకమైన వంట నూనె స్వాధీనం చేసుకున్నారు. కనీసం కస్టమర్లకు అందించే నీరు కూడా పరిశుభ్రంగా లేనట్లు గుర్తించారు.

ఇక ఆహార పదార్థాలకు రంగు వచ్చేలా అత్యంత ప్రమాదకరమైన ఫుడ్ కలర్స్ వాడుతున్నట్లు గుర్తించారు. అక్కడి అపరిశుభ్రమైన వాతావరణం గగుర్పాటు కలిగిస్తోంది. అనంతరం, ముగ్గురిపై కేసులు నమోదు చేశారు.

టోల్​ ఫ్రీ నెంబర్ అందుబాటులోకి.

హైదరాబాద్ నగరంలో కొన్ని రోజులుగా హోటల్స్, రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. వీటిలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. చాలా ఫేమస్ అనుకున్న హోటళ్లలో కూడా ఆహార పదార్థాల నాణ్యత, వాటి తయారీ అత్యంత దారుణంగా ఉంటున్నట్లు గుర్తించారు.

వెంటనే యజమానులకు నోటీసులు జారీ చేయడం, కేసులు పెట్టడం వంటివి చేస్తున్నారు. కల్తీ ఆహారం గుర్తించిన వెంటనే 8712661212 టోల్ ఫ్రీ నెంబరుకు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

Read Also: ఇప్పటిదాకా ఒకలెక్క.. ఇక నుంచి మరో లెక్క: కేటీఆర్ సంచలన కామెంట్స్!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>