కలం, కరీంనగర్: కరీంనగర్‌లోని సుభాష్ నగర్‌లో ఉన్న కళాశాల బాలికల వసతిగృహానికి వెంటనే భవనాన్ని నిర్మించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) జిల్లా కార్యదర్శి తిప్పారపు సురేష్ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కళాశాల వసతి గృహాల సర్వేలో భాగంగా సుభాష్ నగర్ హాస్టల్లో కెవీపీఎస్ కరీంనగర్ (KVPs Karimnagar) బృందం ఆకస్మిక సర్వే నిర్వహించింది.
ఈ సందర్భంగా సుదర్శన్ విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ వసతి గృహంలో ఇంటర్, డిగ్రీ, ఇతర వృత్తి విద్యా కోర్సులు చదువుతున్న 200 విద్యార్థినులు ఉంటున్నారు. పురాతనమైన, శిథిలావస్థకు చేరిన ఈ భవనంలోనే విద్యార్థినులు ఉండాల్సి వస్తుంది. వర్షం వస్తే గదులన్నీ పైకప్పు నుంచి పూర్తిగా కారుతున్నాయన విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి సంవత్సం అందించాల్సిన దుప్పట్లు, మౌలిక సదుపాయాలను ప్రభుత్వం పంపిణీ చేయడం లేదన్నారు. ప్రభుత్వం వసతి గృహ విద్యార్థులకు ప్రతి నెల పాకెట్ మనీ కూడా సకాలంలో అందించడం లేదని విద్యార్థులు తెలిపారు. సుభాష్ నగర్ హాస్టల్ కు వెంటనే భవనం నిర్మించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి సురేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కొండ సురేష్, కేవీపీఎస్ నాయకులు పాల్గొన్నారు.

