బిజినేపల్లిలో నకిలీ ఎరువుల కలకలం.. 111 బస్తాలు స్వాధీనం

కలం, నాగర్ కర్నూల్: నాగర్‌ కర్నూల్ (Nagarkurnool) జిల్లా బిజినేపల్లి మండలంలోని మహదేవునిపేట గ్రామంలో నకిలీ డీఏపీ ఎరువులను వ్యవసాయాధికారులు గుర్తించారు. ఈ మేరకు నాగర్ కర్నూల్ కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్, ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటీల్ శుక్రవారం పరిశీలించారు. తక్కువ ధరకు నకిలీ డీఏపీ ఎరువులు, క్రిమిసంహారక మందులు విక్రయించి మోసానికి పాల్పడుతున్నారనే సమాచారం అందింది. అధికారుల తనిఖీల్లో గ్రామానికి చెందిన ఏడుగురు రైతుల ఇళ్లలో నిల్వ ఉంచిన మొత్తం 111 బస్తాల స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఇప్పటికే పంట పొలాల్లో వినియోగించిన 39 డీఏపీ ఖాళీ సంచులను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

విషయం తెలుసుకున్న కలెక్టర్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. నకిలీ ఎరువులు రైతుల వద్దకు ఎలా చేరాయి? ఏ మార్గంలో సరఫరా జరిగింది? అనే అంశాలపై అధికారులతో చర్చించారు. గ్రామ వ్యవసాయ విస్తీర్ణ అధికారులు మధు, కళ్యాణిలను కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. మహదేవునిపేట గ్రామానికి చెందిన రైతులు కర్ణాటక నుంచి కొంతమంది దగ్గర కొనుగోలు చేసినట్లు కలెక్టర్‌కు వివరించారు. నకిలీ ఎరువులుగా నిర్ధారణ అయితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కలెక్టర్ వెంట నాగర్ కర్నూల్ డీఎస్పీ శ్రీనివాసులు, సిఐ అశోక్ రెడ్డి, డీటీ రవికుమార్, ఎస్ఐ షంషద్దీన్, ఇతర పోలీసు అధికారులు ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>