టెక్నాలజీతో సైబర్ నేరాలకు చెక్: డీజీపీ సీవీ ఆనంద్

కలం, వెబ్ డెస్క్: రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాలు సమాజానికి సవాల్‌గా మారుతున్నాయని డీజీపీ సీవీ ఆనంద్ (DGP CV Anand) అన్నారు. టెక్నాలజీ సాయంతోనే వీటికి చెక్ పెట్టొచ్చని.. ఆ దిశగా పోలీస్ శాఖ సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పనితీరుపై డైరెక్టర్ శిఖా గోయల్, ఇతర ఉన్నతాధికారులతో డీజీపీ కీలక సమీక్ష చేశారు.

దేశంలోనే అత్యధిక కేసులు ఇక్కడే..

దేశ వ్యాప్తంగా నమోదవుతున్న సైబర్ నేరాలపై కేసుల వివరాలను పరిశీలిస్తే.. సుమారు 44 శాతం తెలంగాణలోనే నమోదవుతున్నాయని డీజీపీ సీవీ ఆనంద్ వివరించారు. దీన్ని బట్టి చూస్తే.. తెలంగాణ పోలీస్ శాఖ ఈ తరహా నేరాలపై ఎంతటి శ్రద్ధ పెడుతుందో అర్థమవుతోందన్నారు. పోలీస్ శాఖలో కానిస్టేబుల్ నుంచి ఉన్నతాధికారి వరకు సైబర్ నేరాల దర్యాప్తు చేసేందుకు వీలుగా సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సంపాదించాలని సూచించారు.

2024తో పోలిస్తే నష్టం తక్కువ..

2025లో తెలంగాణలో నమోదైన సైబర్ నేరాల కారణంగా బాధితులు రూ.1,524 కోట్లు నష్టపోయారని డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. అయితే, 2024తో పోలిస్తే ఈ నష్టం 20 శాతానికి తగ్గడం అభినందిచాల్సిన విషయమన్నారు. అంతేగాకుండా పోలీస్ శాఖ చేపడుతున్న అవగాహన చర్యల కారణంగా 3 శాతం ఫిర్యాదులు కూడా తగ్గినట్లు వివరించారు.

ఇక, నేరస్థుల ఖాతాల్లో రూ.279 కోట్ల లావాదేవీలు జరగకుండా నిరోధించి, బాధితులకు రికవరీ చేయించగలిగినట్లు తెలిపారు. ప్రజలు సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయాలని లేదా జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని డీజీపీ ఈ సందర్భంగా ప్రజలకు మరోసారి సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>