కలం, వెబ్ డెస్క్: చర్లపల్లి జైలు (Cherlapalli Jail)లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. రోహిత్ పవార్ (20) అనే యువకుడిపై మే నెలలో జవహర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో పోక్సో (POCSO) కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో పోలీసులు రోహిత్‌ను అదుపులోకి తీసుకొని కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు ఆదేశాల మేరకు రోహిత్‌ను చర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించారు. నెలన్నరకు పైగా జైలులోనే ఉన్న రోహిత్ అక్కడే ఇటీవల ఆత్మహత్యకు యత్నించాడు. జైలులోని స్నానాల గదిలో ఉరి వేసుకొని సూసైడ్ అటెంప్ట్ చేశాడు. జైలు సిబ్బంది గమనించి గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రోహిత్ గురువారం ఉదయం మృతి చెందాడు.

