కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) రూరల్ మండలం చిట్యాల్ (Chityal) గ్రామంలోని స్వర్ణ వాగు వంతెన వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై లింబాద్రి గురువారం తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 40–45 సంవత్సరాల మధ్య ఉంటుందని, అతను తెల్లటి చొక్కా, నల్లటి ప్యాంటు ధరించి ఉన్నాడని వివరించారు.
మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు లేదా అతని కుటుంబ సభ్యుల గురించి సమాచారం ఉన్న వారు వెంటనే నిర్మల్ రూరల్ పోలీస్ స్టేషన్ను సంప్రదించాలన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

