మహబూబ్​నగర్​లో వైభవంగా జగన్నాథ రథయాత్ర

కలం, మహబూబ్​నగర్​ బ్యూరో: మహబూబ్‌నగర్‌లో (Jagannath Rath Yatra) జగన్నాథ రథయాత్ర వైభవంగా జరిగింది. ఈ రథోత్సవానికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ డీకే అరుణతో కలిసి హాజరయ్యారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి రథాన్ని లాగారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జగన్నాథ రథయాత్ర ప్రతి సంవత్సరం భక్తి శ్రద్ధలతో జరుగుతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా భక్తులు రథయాత్రలో పాల్గొంటారని అన్నారు. దేశవ్యాప్తంగా అనేక పట్టణాల్లో రథయాత్రలు నిర్వహించడం ఆనందదాయకమని, మహబూబ్‌నగర్‌లో కొన్ని సంవత్సరాలుగా రథయాత్రను ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారని తెలిపారు. జగన్నాథుని ఆశీస్సులతో వర్షాలు కురిసి, రాష్ట్రవ్యాప్తంగా పంటలు పండాలన్నారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మద్ది యాదిరెడ్డి, ఇస్కాన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే యెన్నంకి ఆహ్వానం

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (MLA Yennam Srinivas Reddy) సౌత్ ఇండియాస్ లార్జెస్ట్ సీఎస్‌ఆర్ సమ్మిట్ 2026కు గెస్ట్ ఆఫ్ ఆనర్‌గా పాల్గొనాలని ఆహ్వానం అందింది. హైదరాబాద్‌లో జూలై 25న నిర్వహించనున్న సమ్మిట్‌కు సంబంధించి నిర్వాహకులు ఆహ్వాన పత్రాన్ని ఎమ్మెల్యేకి అందజేశారు. కార్పొరేట్, ప్రభుత్వ, సామాజిక సేవా రంగాల ప్రముఖులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి, సామాజిక అభివృద్ధి కోసం భాగస్వామ్యాలను పెంపొందించడం ఈ సమ్మిట్ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో 300కిపైగా కార్పొరేట్ ప్రతినిధులు, 1200కిపైగా స్వచ్ఛంద సంస్థలు, 100కిపైగా సామాజిక వ్యాపారవేత్తలు పాల్గొననున్నారు. వివిధ రంగాలకు చెందిన 8 మంది ప్రముఖులు కీలక ప్రసంగాలు చేయనున్నారు. వారిలో యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఒకరు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>