బాధేస్తోంది.. సారీ చెప్పిన మంత్రి లోకేశ్​

కలం, వెబ్ డెస్క్: అమర రాజా కంపెనీ ఎండీ గల్లా జయదేవ్‌కు మంత్రి లోకేశ్ (Lokesh) సారీ చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఆ కంపెనీ కొత్త ప్లాంట్ ప్రారంభోత్సవం జరుపుకున్న నేపథ్యంలో.. గల్లా జయదేవ్‌ను ఉద్దేశించి పోస్ట్ చేశారు. ‘నాలుగు దశాబ్దాలుగా ఏపీ పరిశ్రమల అభివృద్ధిలో అమర రాజా కంపెనీది విజయగాథ. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, వేలాది ఉద్యోగాలతో చిత్తూరు, ఏపీకి దేశ, ప్రపంచ వ్యాప్తంగా గొప్ప పేరు తీసుకొచ్చింది.

అలాంటి కంపెనీని వైసీపీ ప్రభుత్వం తీవ్రంగా వేధించింది. అలా గతంలో ఎప్పుడూ జరగలేదు. సొంత రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలనుకునే పారిశ్రామికవేత్తకు సరైన ప్రోత్సాహం లభించడమనేది ఎంతో ముఖ్యం. కానీ, ప్రభుత్వ వేధింపులతో ఏపీలో పుట్టిన కంపెనీ ఇతర రాష్ట్రాల్లో విస్తరించాలనుకోవడం చూస్తే నిజంగా బాధేస్తోంది’ అన్నారు.

ఏపీకి రావాలని లోకేశ్ విన్నపం..

పెట్టుబడుల కోసం ఏపీ ఆహ్వానిస్తోందని మంత్రి లోకేశ్ (Lokesh) స్పష్టం చేశారు. ‘అమర రాజా (Amara Raja) ఇక నుంచి తన కొత్త ప్లాంట్‌లను ఏ రాష్ట్రంలో పుట్టిందో.. అక్కడ స్థాపిస్తుందని బలంగా నమ్ముతున్నా. మా ద్వారాలు, హృదయం తెరిచే ఉన్నాయి. మీరు ఎప్పుడైనా ఇక్కడికి రావొచ్చు. తెలంగాణలో కొత్త ప్రయాణం ప్రారంభిస్తున్నందుకు మీకు శుభాకాంక్షలు’ అన్నారు.

వైసీపీ ప్రభుత్వంలో ఇదే జరిగింది..

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అమర రాజా కంపెనీ బ్యాటరీస్ ప్లాంట్లలో పర్యావరణ నిబంధనలు ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి యూనిట్ల కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయించింది. దీనిపై అప్పట్లో రాజకీయంగా గగ్గోలు పుట్టించింది. సంస్థ ఎండీ గల్లా జయదేవ్ అప్పుడు టీడీపీ ఎంపీగా ఉండేవారు.

దీంతో, రాజకీయ కక్షతోనే ఆయన కంపెనీని మూసివేసే చర్యలు తీసుకుంటున్నారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. చివరికి తన కొత్త ప్లాంటును స్థాపించేందుకు తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాను ఎంచుకుంది.

Read Also: పూరీ రథయాత్రలో తీవ్ర విషాదం

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>