భైంసా ప్రజలకు MLA కానుక.. శివరామాలయానికి భారీ నిధులు

కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా భైంసా పట్టణంలోని రామ్‌లీలా మైదానంలో నిర్మించనున్న శివరామాలయానికి రూ.50 లక్షల నిధులు మంజూరైనట్లు ముధోల్ ఎమ్మెల్యే (Mudhole MLA ) పవార్ రామారావు (Pawar Rama Rao) తెలిపారు. గురువారం భైంసాలోని తన నివాసంలో ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు, కాలనీవాసులకు మంజూరు పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే (Mudhole MLA) మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకే ఆలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించామని, త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. ప్రజల విశ్వాసాలకు అనుగుణంగా ఆధ్యాత్మిక అభివృద్ధికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. రామాలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేసినందుకు మున్సిపల్ చైర్మన్ తుమ్మల దత్తాత్రి, కౌన్సిలర్ చింతపండు రజిత మహేష్‌తో పాటు ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.

Read Also: నిర్మల్ కాంగ్రెస్‌లో రాజుకున్న అంతర్గత పోరు!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>