కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో గురువారం ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర (Jagannath Rath Yatra) జరగనుంది. ఈ సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు ఉండనున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ (Hyderabad Traffic) పోలీసులు వెల్లడించారు. ప్రయాణికులు, ఉద్యోగులు ఈ విషయాన్ని గుర్తించాలని సూచించారు. గురువారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇందిరా పార్క్ వద్ద గల ఎన్టీఆర్ స్టేడియం నుంచి రథయాత్ర ప్రారంభం కానుంది. ఈ రథయాత్ర ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకు సాగనుంది. ఈ నేపథ్యంలో రథయాత్ర సాగే మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉన్నందున ఆంక్షలు విధించారు.
రథయాత్ర సాగే రూట్ ఇదే..
ఎన్టీఆర్ స్టేడియం – అశోక్‌నగర్ – ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ – నారాయణగూడ – హిమాయత్‌నగర్ – లిబర్టీ – బషీర్‌బాగ్ – అబిడ్స్ – ఎంజే మార్కెట్ – మలక్‌పేట్ – ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ మీదుగా రథయాత్ర సాగనుంది. మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 8 గంటల వరకు బంజారాహిల్స్ జగన్నాథ ఆలయం రథయాత్ర జరుగనుంది. రోడ్ నెంబర్12 పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపు ఉంటుంది. ఫిల్మ్‌నగర్, షేక్‌పేట్, జూబ్లీహిల్స్ వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు వినియోగించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
రథయాత్ర ఊరేగింపు జరిగే సమయంలో ఆయా మార్గాల్లో ప్రయాణించే వాహనదారులు తమ ప్రయాణాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవాలని పోలీసులు కోరారు. ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. రోడ్లపై ట్రాఫిక్ నియంత్రణకు విధుల్లో ఉండే పోలీస్ సిబ్బందికి ప్రయాణికులు సహకరించాలని కోరారు. ట్రాఫిక్‌కు సంబంధించి ఎలాంటి అత్యవసర సహాయం లేదా సమాచారం కోసమైనా 9010203626 నంబర్‌ను సంప్రదించవచ్చని హెల్ప్‌లైన్ నంబర్‌ను విడుదల చేశారు.

