ఆ కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలి: ఏఐటీయూసీ డిమాండ్

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ప్రభుత్వాస్పత్రుల్లో ఏళ్ల తరబడి చాలీచాలని వేతనాలతో కాంట్రాక్టు పద్ధతుల్లో పనిచేస్తున్న కార్మికులను పర్మినెంట్ చేయాలని ఏఐటీయూసీ (AITUC) డిమాండ్ చేసింది. పారిశుద్ధ్య, సెక్యూరిటీ, పేషెంట్ కేర్, సూపర్ వైజర్‌గా పనిచేస్తున్నవారిని వెంటనే పర్మినెంట్ చేయాలని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర కార్యదర్శి పి.సురేశ్ కోరారు.

ఈ మేరకు బుధవారం జడ్చర్ల ఆస్పత్రి కాంట్రాక్ట్ పారిశుద్ధ్య సెక్యూరిటీ పేషెంట్ కేర్ విభాగాల జనరల్ బాడీ సమావేశం నరసింహ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సురేశ్ మాట్లాడారు. జడ్చర్ల ఏరియా ఆస్పత్రిలో మూడేండ్ల కాల వ్యవధితో ప్రభుత్వం ఏజెన్సీ ఎంపిక విధానం కొనసాగుతుందన్నారు. ప్రస్తుతం నడుస్తున్న శాంతి ఏజెన్సీ కాల పరిమితి ముగిసి ఏడాది గడిచిపోతుందన్నారు. అయినా ఏజెన్సీలను రద్దు చేయకుండా పాత ఏజెన్సీల వారికే అనుమతులు పెంచడంతో కార్మికుల సంక్షేమం కుంటుపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఏజెన్సీలో మార్పు సకాలంలో జరగకపోవడం చేత కార్మికుల ఆర్థిక నష్టంతోపాటు శ్రమ దోపిడీకి కూడా గురవుతున్నారని అన్నారు. జడ్చర్ల ఏరియా ఆస్పత్రిలో కార్మికుల వేతనాల చెల్లింపుల్లో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. తక్షణమే విచారణ రిపోర్టును బయటపెట్టాలని డిమాండ్ చేశారు. విచారణ పేరుతో కార్మికులకు మూడు నెలలుగా వేతనాలు చెల్లించలేదని, తక్షణమే పెండింగ్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు.

ఉన్నతాధికారులు స్పందించకుంటే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో యూనియన్ (AITUC) నేతలు కార్మికులు నరసింహ నవీన్, రాజేశ్, రామకృష్ణ, పేర్మల్, అబ్దుల్ అజిద్, నాగరాజ్, మన్నెమ్మ, అలివేల, శివ లీల, పద్మ, నీరజ, భార్గవి, చెన్నమ్మ, అంజలి, లక్ష్మీ, నీలమ్మ, పద్మ, సుమతి, నాగమణి పాల్గొన్నారు.

Read Also: పాద‌యాత్ర‌పై కేటీఆర్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>