నిర్మల్‌లో యువకుడి దారుణ హత్య

కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బుధవారం ఉదయం విశ్వనాథ్‌పేట్ వైఎస్సార్ నగర్ కాలనీ సమీపంలో అస్లం (23) అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి హత్య (Murder) చేశారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. అస్లం ఆటోలో వెళ్తుండగా ముగ్గురు వ్యక్తులు వాహనంలో వచ్చి ఒక్కసారిగా అతనిపై దాడికి పాల్పడ్డారు.

మెడ, కడుపు భాగాల్లో కత్తులతో విచక్షణారహితంగా పొడిచి అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన అస్లంను స్థానికులు వెంటనే ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటన స్థలాన్ని డీఎస్పీ శ్రీనివాస్ పరిశీలించారు. హత్యకు గల కారణాలపై పోలీసులు వివిధ కోణాల్లో విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>