రగులుతున్న పీవోకే.. పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ నిరసనలు

కలం, వెబ్ డెస్క్ : పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (POK)లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాక్ ప్రభుత్వం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా రావల్‌కోట్, ముజఫరాబాద్, మీర్పూర్ వంటి ప్రధాన నగరాల్లో ప్రజలు భారీ ఎత్తున వీధుల్లోకి వచ్చి ఆందోళన నిర్వహించారు. రాజకీయ ప్రాతినిధ్యంలో వివక్ష, దారుణమైన పాలన విధానం, స్థానిక వనరులపై దోపిడీ వంటి అంశాలపై అక్కడి జనాభా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JKJAAC) ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసనలు చేపట్టారు.

కాగా, పీవోకే అసెంబ్లీలో స్థానికేతర శరణార్థుల కోసం పాక్ ప్రభుత్వం ప్రత్యేకంగా 12 సీట్లను కేటాయించడం ఈ తాజా ఉద్రిక్తతలకు ప్రధాన కారణమైంది. పాకిస్తాన్‌లోని ఇతర ప్రాంతాలలో నివసిస్తున్న వారికి ఈ సీట్లు కేటాయించడం వల్ల, స్థానిక కాశ్మీరీల రాజకీయ ప్రాతినిధ్యం దెబ్బతింటుందని నిరసనకారులు ఫైర్ అవుతున్నారు. తమ ప్రాంతంలో లేని వారు తమ భవిష్యత్తును ఎలా శాసిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. అసెంబ్లీలో స్థానికులకే పూర్తి ప్రాధాన్యత ఇవ్వాలని.. పీవోకే వనరులను పాకిస్తాన్ ప్రభుత్వం దోచుకోకుండా, స్థానికులకే కేటాయించాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. విపరీతంగా పెరిగిన ద్రవ్యోల్బణం, విద్యుత్ ఛార్జీలు, పిండి వంటి నిత్యావసరాల ధరలను తగ్గించాలని ఆందోళనకారులు కోరుతున్నారు. దీంతో ప్రస్తుతం పీవోకేలో టెన్షన్ వాతావరణం నెలకొంది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>