పార్టీ నేత‌ల సోష‌ల్ మీడియాపై ఏఐసీసీ ఆరా!

క‌లం, వెబ్ డెస్క్‌: ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (AICC) ఆస‌క్తిక‌ర విధానానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) పార్టీ ప్ర‌జాప్ర‌తినిధుల ప‌ని తీరుపై తీసుకుంటున్న ఫీడ్ బ్యాక్‌తో పాటు వారి సోష‌ల్ మీడియా ఖాతాల‌పై కూడా దృష్టి పెట్టింది. తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు త‌మ‌ నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌రుగుతున్న అభివృద్ధితో పాటు వారి సోష‌ల్ మీడియా వినియోగం వాటి స్థితి గ‌తుల‌పై ఫీడ్ బ్యాక్ ఫారంలో వివ‌రాలు అందించాల్సి ఉంటుంది. వీట‌న్నింటిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని వారి ప‌ని తీరును అంచ‌నా వేయ‌నున్నారు.

ఈ మేరకు ఏఐసీసీ (AICC) రూపొందించిన ఫీడ్‌బ్యాక్ ఫారంలో ఎక్స్‌, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, వాట్సాప్ వంటి సోష‌ల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ల‌లో ప్రజాప్రతినిధుల ప‌నితీరుపై వివ‌ర‌ణ కోరారు. మారుతున్న కాలంతో పాటు రాజ‌కీయాలు కూడా చాలా మారిపోయాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌ల‌తో నేరుగా సంబంధాలు ఏర్ప‌ర్చుకోవ‌డం ఎంత‌ ముఖ్య‌మో డిజిట‌ల్ వేదిక‌ల్లో ప్ర‌జ‌ల‌కు చేరువ కావ‌డం కూడా అంతే ముఖ్యమ‌ని ఏఐసీసీ భావిస్తోంది. అందుకే ప్ర‌జా ప్ర‌తినిధుల ప‌ని తీరుపై రెండింటినీ ప‌రిగ‌ణ‌లోకి తీసుకోనుంది.

Read Also: సీఎం రేవంత్ రెడ్డికి రెండు ఓట్లు.. ఈసీ కీలక ప్రకటన

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>