కలం, మహబూబ్ నగర్ బ్యూరో: శరీర అవయవదానాలపై ప్రజల్లో అవగాహనా కల్పించేందుకు ఆగస్టు ఒకటో తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అవయవ దాన పక్షోత్సవాలను (Organ Donation Fortnight) నిర్వహించాలని రాష్ట్ర శరీర అవయదాతల సంఘం తీర్మానించింది. ఆ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు లయన్ డాక్టర్ అంబటి నటరాజ్ అధ్యక్షతన ఆదివారం మహబూబ్ నగర్ లోని రెడ్ క్రాస్ సన్నిధి ఆశ్రమంలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షులు సురభి జగపతి రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
శరీర అవయ దాతల సంఘం జాతీయ కన్వీనర్ ఎల్ వి కుమార్, రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రాంచంద్ర రావు, ప్రధాన కార్యదర్శి జి. గురు ప్రకాష్, ప్రధాన సలహాదారులు అనురాధ రెడ్డి, ఉపాధ్యక్షులు గంగాధర్ రెడ్డి, రత్న కుమారి, న్యాయ సలహాదారులు గోవర్ధన్ యాదవ్, జాయింట్ సెక్రెటరీ లు కవిత, రజిని, సాజిదా సికిందర్, కార్యనిర్వాహక కార్యదర్శి రాజులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా అవయదానంపై ఆగస్టు ఒకటి నుంచి మెడికల్, నర్సింగ్, డిగ్రీ, ఇంజనీరింగ్, జూనియర్ కళాశాలల్లో అవగాహనా సదస్సులు నిర్వహించాలని నిర్ణయించినట్లు కార్యనిర్వహక అధ్యక్షులు నటరాజు తెలిపారు. మూఢ నమ్మకాలను దూరం చేసి నేత్ర, అవయ, శరీర దానం చేయడంలో ప్రజలను చైతన్యం చేసేందుకు రాష్ట్ర, జిల్లా బాధ్యులు విస్తృత స్థాయిలో కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కేజీయా, కాగితల మధు, ఎ. నాగేశ్వర్, వేణు గోపాల్, రాజు, తదితరులు పాల్గొన్నారు.

