కొండా మురళి పెద్దపులి.. నవీన్ రాజ్ చిన్నపులి: కొండా సురేఖ

కలం, వరంగల్ బ్యూరో: కొండా మురళి (Konda Murali) పెద్దపులి అయితే.. ఆయన అనుచరుడు నవీన్ రాజ్ చిన్నపులి అంటూ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు (Konda Surekha) రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. వరంగల్ గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా ఆదివారం మీసాల ప్రకాష్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధిపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. దేవాలయాల్లో వేలాది కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.

బాసర నుంచి భద్రాచలం వరకు..

తెలంగాణలో ఆధ్యాత్మిక పర్యాటకాన్ని మరింత ప్రోత్సహించేందుకు బాసర నుంచి భద్రాచలం వరకు టెంపుల్ టూరిజం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని వెల్లడించారు. దేవాలయాల చుట్టూ మౌలిక వసతుల కల్పన, రహదారుల అభివృద్ధి, భక్తుల కోసం ప్రత్యేక సదుపాయాల ఏర్పాటు వంటి పనులు వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. రాజకీయ అంశాలపై మాట్లాడిన మంత్రి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు కాంగ్రెస్ కార్యకర్తలు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని సూచించారు. వరంగల్ మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకోవాలంటే ప్రతి డివిజన్‌లో గ్రౌండ్ వర్క్ చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా ప్రకాష్‌

ఈ సందర్భంగా పార్టీ నాయకుడు నవీన్ రాజ్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. “కొండా మురళి పెద్దపులి అయితే.. ఆయన అనుచరుడు నవీన్ రాజ్ (Naveen Raj) చిన్నపులి” అని వ్యాఖ్యానించారు. పార్టీ కోసం కష్టపడే నాయకత్వాన్ని కార్యకర్తలు ఆదర్శంగా తీసుకోవాలని ఆమె (Konda Surekha) సూచించారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మీసాల ప్రకాష్‌కు మంత్రి కొండా సురేఖతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Read Also: కేసీఆర్ వస్తే లాగులు తడుపుకుంటారు.. జగదీశ్ రెడ్డి ఫైర్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>