వాటర్ ట్యాంక్‌కు స్మార్ట్ సొల్యూషన్.. మొబైల్ నుంచే మోటార్ ఆన్, ఆఫ్ చేయొచ్చు

కలం, వెబ్‌‌డెస్క్: నేటి డిజిటల్ యుగంలో టెక్నాలజీ మానవ జీవితాన్ని సులభతరం చేసింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. సాధారణంగా మన ఇంటి పైకప్పుపై ఉన్న వాటర్ ట్యాంక్ నిండిందో లేదో తెలుసుకోవడానికి మనం పైకి వెళ్లి చూస్తుంటాం. కానీ ఇంట్లో కూర్చునే ట్యాంక్ నిండిందో, లేదో తెలుసుకోవచ్చు అంటే మీరు నమ్ముతారా? దీనికి కూడా ఒక డివైస్ ఉంటుందని మీకు తెలుసా? దీని గురించి ఇప్పుడే తెలుసుకుందాం.

ఇంటి పైకప్పుపై ఉన్న వాటర్ ట్యాంక్‌లో నీటి పరిమాణం ఎంత ఉందో తెలుసుకునేందుకు ఇప్పుడు ఒక స్మార్ట్ డివైస్ IoT (Internet of Things) (Smart IoT Device) వచ్చింది. దీని సహాయంతో మనం మన మొబైల్ ఫోన్ నుంచే వాటర్ ట్యాంక్‌లో ఎంత నీరు ఉందో తెలుసుకోవచ్చు. అంతేకాదు ట్యాంక్ నిండిన వెంటనే మోటార్ ఆటోమేటిక్‌గా ఆఫ్​ అయ్యే సదుపాయం కూడా ఈ డివైస్‌లో ఉంది.

చాలా ఇళ్లలో వాటర్ ట్యాంకులు ఇంటి పైకప్పు పైనే ఉంటాయి. అయితే ప్రతీసారి ట్యాంకులో నీటిమట్టాన్ని తెలుసుకునేందుకు మెట్లు ఎక్కి పైకి వెళ్లడానికి చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఉద్యోగం, వ్యాపారాల రీత్యా పిల్లలు బయటికి వెళ్లినప్పుడు వయసు పైబడిన వారి తల్లిదండ్రులు మాత్రమే ఇంట్లో ఉండాల్సి వస్తుంది. వారు పైకెక్కి చూడలేరు. ఈ సమస్యకు పరిష్కారంగా ఇప్పుడు మార్కెట్‌లో ఫ్లోసెన్సో ప్రో (FlowSenso Pro) అనే పరికరం అందుబాటులోకి వచ్చింది. ఇది IoT ఆధారిత స్మార్ట్ వాటర్ లెవెల్ కంట్రోలర్.

ఈ డివైస్‌ను ఇంటి వాటర్ ట్యాంక్‌పై అమర్చి, స్మార్ట్ స్విచ్ లేదా వాటర్ పంప్‌కు కనెక్ట్ చేస్తారు. ఈ పరికరం ట్యాంక్‌లోని నీటి మట్టాన్ని నిరంతరం పర్యవేక్షిస్తుంది. కొన్నిసార్లు మనం మోటార్ వేసి మర్చిపోతుంటాం. అప్పుడు నీళ్లు వృధాగా పోతుంటాయి. అలా జరగకుండా ఈ డివైస్ ట్యాంక్ నిండిన వెంటనే ఆటోమేటిక్‌గా మోటార్‌ను ఆఫ్​ చేస్తుంది. దీనివల్ల నీటి వృధాతో పాటు విద్యుత్ కూడా ఆదా అవుతుంది.

అసలు దీన్ని ఎలా ఆపరేట్ చేయాలి అని ఆలోచిస్తున్నారా? దీనికోసం ఫ్లోసెన్సో ప్రోతో పాటు ప్రత్యేక మొబైల్ యాప్ కూడా అందుబాటులో ఉంటుంది. అ యాప్ ద్వారా మీరు ఎక్కడున్నా ఇంటి వాటర్ ట్యాంక్‌లో ఎంత నీరు గుర్తించవచ్చు. మొబైట్ యాప్‌లోనే వాటర్ ట్యాంక్‌లోని నీటి మట్టం శాతం తెలుస్తుంది. ఉదాహరణకు ట్యాంక్ 20 శాతం, 50 శాతం, 75 శాతం, 100 శాతం ఇలా ఎంత పరిమాణంలో ట్యాంక్ నిండిందో స్పష్టంగా తెలుసుకోవచ్చు.

ఈ స్మార్ట్ డివైస్‌తో మోటార్‌ను ఎక్కడి నుంచైనా మొబైల్‌లోనే ఆన్ చేయవచ్చు, అవసరమైనప్పుడు ఆఫ్ చేయవచ్చు. అంతే కాకుండా నిర్దిష్ట సమయానికి మోటార్ ఆటోమేటిక్‌గా పనిచేసేలా కూడా షెడ్యూల్ చేయవచ్చు. ట్యాంక్ నిండిన వెంటనే మోటార్ ఆటోమేటిక్‌గా ఆఫ్ అవుతుంది.

డ్రై రన్ ప్రొటెక్షన్ ఫీచర్

సాధారణంగా మోటార్ వేసినప్పుడు బోరు బావిలో నీరు లేకపోయినా మోటార్ నిరంతరం పనిచేస్తుంది. దీంతో మోటార్ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కానీ ఈ సమస్యకు ఈ డివైస్‌తో చెక్ పెట్టవచ్చు. ఈ ఫ్లోసెన్సో ప్రోలో డ్రై రన్ ప్రొటెక్షన్ ఫీచర్ ఉంటుంది. ఇది నీటి ప్రవాహం లేదని గుర్తిస్తే వెంటనే మోటార్‌ను ఆటోమేటిక్‌గా ఆఫ్​ చేస్తుంది. దీనివల్ల పంపు సురక్షితంగా ఉంటుంది.

అంతే కాకుండా ఈ పరికరం చాలా తక్కువ విద్యుత్‌ను వినియోగిస్తుంది. ఫ్లోసెన్సో ప్రో స్మార్ట్ వాటర్ లెవల్ కంట్రోలర్ మార్కెట్‌లో సుమారు రూ. 10 వేల ధరకు అందుబాటులో ఉంది. ఇందులో స్మార్ట్ కంట్రోలర్ తో పాటు మొబైల్ యాప్ సపోర్ట్, రిమోట్ కంట్రోల్, ఆటోమేటిక్ మోటార్ ఆన్/ఆఫ్, డ్రై రన్ ప్రొటెక్షన్ వంటి అధునాతన ఫీచర్లు లభిస్తాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>