మళ్లీ కరోనా కలకలం.. ప్రభుత్వం కీలక ఆదేశాలు!

కలం, వెబ్ డెస్క్ : దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందస్తుగా అప్రమత్తమైంది (Covid Alert). రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల వైద్యారోగ్య శాఖ అధికారులను అలర్ట్ చేస్తూ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. అన్ని జిల్లాల వైద్య, ఆరోగ్య అధికారులు (DM&HOs), జిల్లా సర్వెలెన్స్ అధికారులు (DSOs) క్షేత్రస్థాయిలో ఐఎల్ఐ (ILI), సారి (SARI) కేసులపై నిఘాను మరింత బలోపేతం చేయాలని స్పష్టం చేసింది. కరోనా లక్షణాలు ఉన్నవారిని గుర్తించి నిరంతరం పర్యవేక్షించాలని సూచించింది.

రాష్ట్రంలో ఎలాంటి అత్యవసర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు వీలుగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ఇందులో భాగంగా కోవిడ్ పరీక్షలను ముమ్మరం చేయడంతో పాటు, ఆర్‌టి-పిసిఆర్ (RT-PCR) ల్యాబ్‌లను పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంచాలని పేర్కొంది. ఆసుపత్రుల్లో పిపిఇ (PPE) కిట్లు, తగినంత ఆక్సిజన్ సరఫరా, ఐసోలేషన్ వార్డులు మరియు అంబులెన్స్ సదుపాయాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూసుకోవాలని స్పష్టం చేసింది.

హాస్పిటల్స్ లో ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ (IPC) ప్రోటోకాల్స్‌ను తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఏ ప్రాంతంలోనైనా కేసుల్లో అసాధారణమైన పెరుగుదల లేదా కొత్త క్లస్టర్లు కనిపిస్తే, ఆ సమాచారాన్ని ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే రాష్ట్ర సర్వెలెన్స్ యూనిట్‌కు నివేదించాలని వైద్య శాఖ అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రజలు కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా (Covid Alert) ఉండాలని అధికారులు కోరుతున్నారు.

Read Also: ‘క్షణకాలపు అజాగ్రత్త.. జీవితకాలపు ఆవేదన’.. సజ్జనార్ కీలక పోస్ట్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>