రైతుల మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి అడ్లూరి

కలం, కరీంనగర్ బ్యూరో: రాష్ట్రంలోని రైతులకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వం లక్షమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Minister Adluri Lakshman Kumar) స్పష్టం చేశారు. శనివారం జగిత్యాల జిల్లా ధర్మపురి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ధర్మపురి నియోజకవర్గంలో 90,761 రైతులకు రూ.87.21 కోట్లు రైతు భరోసా వేయడం జరిగిందని అన్నారు. జగిత్యాల జిల్లాలో మొత్తం 2, 29,213 రైతులకు గాను రూ. 243.40 కోట్లు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని 32 జిల్లాలోని 70,40,286 రైతుల గాను రూ 875. 96 కోట్లు రైతులకు ఖాతాలో జమ చేయడం జరిగిందని అన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ధర్మపురి నియోజకవర్గ అభివృద్ధికి దూరంగా మారిందని అన్నారు. గోదావరి తీరాన ఉన్న ధర్మపురికి తాగునీటి సమస్యను తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పరిష్కరించినట్లు మంత్రి తెలిపారు. నియోజకవర్గంలో ఎలాంటి అనుమతి లేకుండానే రోడ్ల వాగు ప్రాజెక్టు నిర్మాణం పేరుతో కమిషన్లు దండుకున్నారని అక్క పల్లి ఎత్తిపోతల పథకాన్ని ఏనాడు పట్టించుకోలేదని ధర్మపురి పట్టణంలో ఏర్పాటు చేసిన మాతాశిశు సంక్షేమాన్ని కాంట్రాక్టర్ కి కనీసం బిల్లులు ఇవ్వలేదని మంత్రి ఆరోపించారు.

అదే విధంగా ధర్మపురికి డిగ్రీ కళాశాల తీసుకురావడం జరిగిందని మంత్రి తెలిపారు. రూ.10 కోట్ల సీఎస్ఆర్ నిధులు తీసుకువచ్చి భవన నిర్మాణం చేయడానికి చర్యలు తీసున్నామని అన్నారు. ధర్మపురి యాదవ్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించడం జరిగింద ని పవిత్ర నది స్థానానికి వచ్చే భక్తుల కోరకు గోదావరిలో మురుగు నీరు కలవకుండా సీవరేజ్ ప్లాంట్ నిర్మాణం చేస్తున్నామని మంత్రి తెలిపారు. ధర్మపురి పట్టణంలో కుల సంఘాల భవనాలు నిర్మించడానికి నిధులు మంజూరు చేశామని మంత్రి తెలిపారు.

నియోజకవర్గంలోని 149 గ్రామాల్లో అంగన్ వాడీ భవనాల నిర్మాణం, మహిళా సంఘాలకు వివో భవనాలు నిర్మాణం చేయడంతో పాటు ప్రభుత్వ పాఠశాలలో అవసరమైన చోట అదనపు తరగతి గదులు నిర్మాణం చేస్తూ ముందుకు సాగుతుందని మంత్రి తెలిపారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతున్న ప్రతిపక్షాల నాయకులు కొందరు సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేస్తామని తెలిపారు. నియోజకవర్గంలోని అభివృద్ధి లక్ష్యంగా తాము ముందుకు సాగుతున్నామని అన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>