కలం, జనగామ: జనగామ జిల్లా బచ్చన్నపేట (Bachannapet) మండల కేంద్రంలో భారీ చోరీ చోటుచేసుకుంది. ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు వెళ్లిన సమయంలో గుర్తు తెలియని దుండగులు తాళం పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించి సుమారు 9.5 తులాల బంగారు ఆభరణాలు, 1.6 కిలోల వెండి వస్తువులు, రూ.50 వేల నగదును (Gold and Silver Burglary) అపహరించారు. బాధితుడు దొంతుల సోమలింగం మోకాళ్ల శస్త్రచికిత్స నిమిత్తం తన భార్యతో కలిసి హైదరాబాద్‌కు వెళ్లగా, ఈ నెల 8న ఆయన చిన్న కుమారుడు దొంతుల ప్రణయ్ కూడా ఇంటికి తాళం వేసి హైదరాబాద్‌కు వెళ్లాడు.
జూలై 10 రాత్రి కుటుంబ సభ్యులు తిరిగి ఇంటికి రాగా ప్రధాన ద్వారం తాళం పగులగొట్టి ఉండటాన్ని గమనించారు. అనంతరం ఇంట్లోని బీరువాను పరిశీలించగా అందులో భద్రపరిచిన బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు బచ్చన్నపేట పోలీసులు కేసు నమోదు చేసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్ ఘటనాస్థలికి చేరుకుని శాస్త్రీయ ఆధారాలను సేకరించింది. నిందితులను గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు బచ్చన్నపేట ఎస్‌ఐ శ్రీకాంత్ తెలిపారు.
Read Also: ప్రముఖ గాయని ఎస్. జానకి కన్నుమూత
Follow Us On: Instagram

