కలం, వెబ్ డెస్క్: మాజీ మంత్రి హరీశ్ రావుపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. క్రషర్ యజమానుల దగ్గర రూ.లక్ష కూడా వదలకుండా దోచుకుంటున్నాడని.. ఆయన అత్యంత అవినీతిపరుడని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మూడు శాతం కమీషన్లు తీసుకున్నాడని.. అందుకే ఏడాది పాటు మంత్రి పదవి ఇవ్వకుండా కేసీఆర్ దూరం పెట్టాడని ఆరోపించారు.
పది శాతం కమీషన్లు తీసుకున్నారు..
ఇప్పుడు హరీశ్ (Harish Rao) మంత్రి పదవి కావాలంటున్నాడని.. అప్పటి కమీషన్లు వసూల్ చేసుకుంటారా.. అని సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ ఆరు శాతం, కేటీఆర్ ఒక శాతం కమీషన్లు తీసుకున్నారని.. మొత్తంగా కుటుంబమంతా పది శాతం కమీషన్లతో దోచుకున్నారని మండిపడ్డారు. మామ గుడిని మింగే రకం అయితే.. అల్లుడు హరీశ్ గుడిలో లింగాన్ని కూడా మింగే రకమన్నారు.
బెదిరించి పాలు కొనిపిస్తున్న హరీశ్..
హరీశ్ రావు నారాయణ, చైతన్య కాలేజీలను బెదిరించి తన డెయిరీ సంస్థ పాలు కొనేలా చేస్తున్నాడని.. అదొక బతుకేనా అంటూ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. హరీశ్ రావు చివరికి అరటిపండ్ల వారిని కూడా వదలడని మండిపడ్డారు.
ఆయన ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడే ఏపీ నీళ్లు తీసుకుపోయిందని, 2020–21లో 30 టీఎంసీలను తరలిస్తే ఏం చేశాడని సీఎం రేవంత్ ప్రశ్నించారు. పోలవరం పూర్తయ్యాక పట్టిసీమ మూసేస్తామని ఏపీ ప్రభుత్వం స్పష్టంగా చెప్పిందన్నారు.
Read Also: ఈటల అంటే గౌరవమే కానీ.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Follow Us On: Instagram

