కలం, వెబ్ డెస్క్ : భారతీయ సంస్కృతిలో భాగంగా ఉన్న ఉమ్మడి కుటుంబాలు (Joint Family) కనుమరుగు అవుతున్న నేటి కాలంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ కుటుంబం ఆదర్శంగా నిలుస్తోంది. అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గం మండలంలోని నాగప్ప కుటుంబంలో (Nagappa Family) ఆరు తరాలకు చెందిన 83 మంది సభ్యులు ఒకే ఇంట్లో నివసిస్తుస్తూ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని చాటుతున్నారు.
అందరూ కలిసి భోజనం చేయడం, సంపాదించిన ఆదాయాన్ని పంచుకోవడం, కుటుంబ బాధ్యతలను సమిష్టిగా నిర్వహిస్తున్న ఈ కుటుంబ ప్రత్యేకతను చాటుతోంది. ఇంత పెద్ద కుటుంబంలో సభ్యుల సంఖ్య పెరిగే కొద్దీ అభిప్రాయ భేదాలు, తరాల మధ్య ఆలోచనా విధానంలో విభేదాలు వస్తుంటాయి.
కానీ, కుటుంబ పెద్దల మార్గదర్శకత్వంలో ప్రతి సమస్యను పరిష్కరించుకుంటూ కలిసి మెలిసి జీవిస్తున్నారు. ఈ కుటుంబంలో 43 మంది ఓటర్లు ఉండగా 20 మంది కుమారులు, 20 మంది కోడళ్లు ఉన్నారు. పండుగలొస్తే ఈ కుటుంబంలో సందడి మరింత ప్రత్యేకంగా ఉంటుంది. వ్యవసాయమే ఈ కుటుంబం జీవనాధారంగా ఉంది.
Read Also: ఇంటి అద్దె పెంచడం ఓనర్ ఇష్టమా.. చట్టం ఏం చెప్తోంది?
Follow Us On : WhatsApp

