ఇరాన్‌తో యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన

కలం, వెబ్ డెస్క్: ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Trump) కీలక ప్రకటన చేశారు. ‘చర్చలు జరుపుదామని ఇరాన్ నన్ను కోరింది. నేను అంగీకరించాను. కానీ, కాల్పుల విరమణ గడువు మాత్రం ముగిసిపోయిందనే విషయాన్ని వారికి చాలా స్పష్టంగా చెప్పాను’ అని ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఇటీవల ఇరాన్, అమెరికా పరస్పర దాడుల నేపథ్యంలో పశ్చిమాసియాలో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గల్ఫ్ దేశాలపై ఇరాన్ మళ్లీ దాడులకు దిగడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. దీంతో, వెంటనే ఖతార్ ప్రతినిధులు ఇరాన్‌కు వెళ్లి చర్చలపై వాషింగ్టన్, టెహ్రాన్‌ను ఒప్పంచగలిగారు.

మళ్లీ దాడులు జరిగే అవకాశం..?

ఇరాన్ తో చర్చలకు అంగీకరిస్తూనే.. కాల్పుల విరమణ గడువు ముగిసిపోయిందని ట్రంప్ పేర్కొనడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. త్వరలోనే దాడులు జరగబోతున్నాయని సంకేతం ఇస్తున్నారా..? అనే చర్చ జరుగుతోంది. వాస్తవానికి మొదటి దఫా శాంతి చర్చలు పూర్తయ్యాక.. ఇక యుద్దం ముగిసినట్లే అని అన్ని దేశాలు భావించాయి.

కానీ, అనూహ్యంగా హూర్ముజ్ జలసంధి కారణంగా రెండు దేశాలు పరస్పరం దాడులకు దిగాయి. హూర్ముజ్ జలసంధిలోని నౌకలపై ఇరాన్ దాడులు చేస్తే.. ఇరాన్ ఆధీనంలోని ఖేష్మ్ వంటి దీపాలపై అమెరికా బాంబులు వేసింది.

వణికిపోతున్న గల్ఫ్ దేశాలు..

అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధంతో గల్ఫ్​ దేశాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అమెరికా ఇరాన్ పై దాడి చేయడమే ఆలస్యం.. వెంటనే టెహ్రాన్ గల్ఫ్ దేశాలపైకి మిస్సైల్స్ ఎక్కు పెడుతోంది. ఇటీవల దాడులకు బహ్రెయిన్, దుబాయ్ మళ్లీ వణికిపోయాయి.

ఆయా దేశాల్లో అగ్ర రాజ్య స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ క్షిపణులు ప్రయోగిస్తోంది. ఇప్పటికే యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. దీంతో ఇరాన్, అమెరికా మధ్య శాశ్వత శాంతి కుదిరేలా శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>