పండ్లు, కూరగాయలు తాకితే కొనాల్సిందే.. ఈ వింత రూల్ ఎక్కడో తెలుసా?

కలం, వెబ్ డెస్క్: సాధారణంగా మనం పండ్లు, కూరగాయలు కొనడానికి సూపర్ మార్కెట్‌కు వెళ్తుంటాం. అయితే కొనేముందు అవి తాజాగా ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి చేత్తో పట్టుకుని, పరీక్షించి.. నచ్చకపోతే మళ్లీ అక్కడే పెట్టేస్తుంటాం. మన భారతదేశంలో ఇది చాలా సర్వసాధారణ విషయం. కానీ, మనం అలా తాకిన పండ్లను లేదా కూరగాయలను ఖచ్చితంగా కొనాలనే కఠినమైన నియమం ఒక దేశంలో ఉందనే విషయం మీకు తెలుసా? అయితే తెలుసుకోవాల్సిందే.

ఈ వింతైన రూల్ ఎక్కడో కాదు జపాన్ (Japan Shopping Rule) దేశంలో ఉంది. జపాన్ వెళ్లిన ఒక భారతీయ పర్యాటకుడు అక్కడి షాపింగ్ సంస్కృతిని వివరిస్తూ చేసిన పోస్ట్ నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. జపనీస్ సంస్కృతిలో పరిశుభ్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారట. అందుకే అక్కడి నిబంధనల ప్రకారం.. కస్టమర్లు తమకు కావాల్సిన వస్తువులను కేవలం కళ్లతో చూసి మాత్రమే ఎంపిక చేసుకోవాలట. ఒకవేళ మీరు ఏదైనా పండు, లేదా కూరగాయను తాకితే తిరిగి యధాస్థానంలో పెట్టడానికి వీలు ఉండదట. ఖచ్చితంగా దానికి బిల్ చెల్లించాల్సిందే.

దీనికి కారణం.. పదే పదే చేతులతో తాకడం వలన కూరగాయలు, పండ్లపై క్రిములు వ్యాపించే అవకాశం ఉందని, అంతే కాకుండా నలిగిపోయి పాడవుతాయని ఉద్దేశంతో వారు ‘నో టచ్’ లేదా ‘ముట్టుకుంటే కొనాలి’ అనే రూల్‌ను పెట్టారట. అలాగే జపాన్ దుకాణదారులు మార్కెట్‌కు తెచ్చే ముందే ప్రతి వస్తువు నాణ్యంగా ఉందా? లేదా అనే పరీక్షలు చేసి ప్యాక్ చేస్తారట. అందుకే వాటిని మళ్లీ కస్టమర్లు పరీక్షించాల్సిన అవసరం లేదనేది వారి నమ్మకంగా చెబుతున్నారు.

Read Also: బాలయ్య ఫ్యాన్స్‌కు పూనకాలే.. మోక్షజ్ఞ కోసం రంగంలోకి సందీప్ వంగా!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>