కలం, వెబ్ డెస్క్: ప్రధాని మోదీ (PM Modi) న్యూజిలాండ్ చేరుకున్నారు. 40 ఏళ్ల తరువాత భారత ప్రధాని ఈ దేశంలో పర్యటిస్తుండటం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఆక్లాండ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మోదీకి న్యూజిలాండ్ ప్రధాని లుక్సన్ స్వయంగా స్వాగతం పలకడం గమనార్హం. అందుకు సంబంధించి ఫొటోలను ప్రధాని మోదీ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
చారిత్రాత్మక పర్యటన ఇది..
ప్రధాని మోదీ (PM Modi) తన ఎక్స్ ఖాతాలో ‘ఇదొక చారిత్రాత్మక పర్యటన. నాలుగు దశాబ్దాల తరువాత న్యూజిలాండ్ (New Zealand) కు భారత ప్రధాని వచ్చారు. ఇండియా-న్యూజిలాండ్ ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించడంతో పాటు ప్రధాని లుక్సన్ తో సమావేశమై.. చర్చలు జరపబోతున్నా. అలాగే, రేపు ఆక్లాండ్‌లో భారత సంతతి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నా’ అని పేర్కొన్నారు.
ఆస్ట్రేలియాతో కీలక ఒప్పందం..
ఆస్ట్రేలియా పర్యటన విజయవంతంగా పూర్తి చేసిన ప్రధాని మోదీ.. ఈ సందర్భంగా కుదుర్చుకున్న పౌర అణు ఒప్పందం రెండు దేశాల సంబంధాల్లో గొప్ప ముందడుగుగా దౌత్య నిపుణులు అభివర్ణించారు. ఇక నుంచి భారత్ అణు ప్రాజెక్టులకు ఆస్ట్రేలియానే యురేనియం సరఫరా చేయబోతుంది. దీన్ని పూర్తిగా పౌర అవసరాల కోసమే వినియోగించబోతున్నారు. ఆస్ట్రేలియాలో అత్యంత నాణ్యమైన యురేనియం లభిస్తోంది.
Read Also: హరీశ్.. పదేళ్లు ఏం చేశావ్?: మహేశ్ కుమార్ గౌడ్
Follow Us On : WhatsApp

