రావణ్ ను అణచివేసేందుకే ఉపా కేసు : అంబటి రాంబాబు

కలం, వెబ్​ డెస్క్​ : ప్రశ్న రావణ్ (Prashna Ravan)​ ఐడియాలజీ తమ ఐడియాలజీ ఒకటి కాదని వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు (Ambati Rambabu) మరోసారి స్పష్టం చేశారు. ప్రశ్న రావణ్ పై పెట్టిన కేసు ముమ్మాటికీ అన్యాయం, అక్రమం అని విమర్శించారు. రావణ్ ను అణచివేసేందుకే ఉపా కేసు పెట్టారని ఆరోపించారు. ఉపా చట్టానికి వ్యతిరేకంగా చేసే పోరాటానికి వైసీసీ మద్దతిస్తుందని వెల్లడించారు. రావణ్ పై ఒక స్టేషన్ లో బెయిల్ రాగానే అరెస్ట్ చేసి మరో స్టేషన్ కు తీసుకెళ్లారని.. నాలుగు చోట్ల బెయిల్ రావడంతో చివరికి ఉపాచట్టం పెట్టారని ధ్వజమెత్తారు.

ఉపా కేసు పెట్టి రిమాండ్ కు పంపించాక ఇప్పుడు దర్యాప్తు మొదలు పెట్టి.. రావణ్ ఇంటిలో సోదాలు చేశారన్నారు. ఉపా చట్టానికి కావాల్సిన ఆధారాలు సేకరించడం కోసం పోలీసులు ఇప్పుడు ప్రయత్నిస్తున్నారని అంబటి (Ambati Rambabu) చెప్పారు. పోలీస్ స్టేషన్ లో ఉన్న రావణ్ ను చంపేందుకు జనసేన కార్యకర్తలు యత్నించినా కేసు పెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రావణ్​ కు తాము సపోర్ట్​ చేయడం లేదని.. అతడు తమను కూడా దూషించాడని గుర్తు చేశారు.

కానీ, రావణ్​ పై అన్యాయమైన చట్టాన్ని పెట్టి అణచివేయాలని చూడటాన్ని వ్యతిరేకిస్తున్నామని అంబటి స్పష్టం చేశారు. ఈ దుర్మార్గమైన చర్యను కచ్చితంగా ప్రతిఘటిస్తామని స్పష్టం చేశారు. సాయికృష్ణ,క్రాంతి కుమార్ లు చనిపోతే మేం వారికి అండగా నిలిస్తే కొందరు రౌడీషీటర్లకు మద్దతిస్తారా అని కొందరు ప్రశ్నిస్తున్నారన్నారు. అయితే, తాము రౌడీషీటర్లకు కాదు చనిపోయిన వారికి మాత్రమే మద్దతిస్తున్నామని చెప్పారు. దుర్మార్గంగా పోలీసుల హింసకు బలైపోయిన వారికి మద్దతిస్తే తప్పా అని అంబటి రాంబాబు ప్రశ్నించారు.

Read Also: నేడు ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>