Mobile Popup Ad
Mobile Popup Ad

ఛీ ఛీ.. యువకుడిపై ప్రిన్సిపాల్ లైంగికదాడి..!

కలం, నాగర్ కర్నూల్ : సభ్య సమాజం ఎటుపోతుందో తెలియని పరిస్థితులు నెలకున్నాయి. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఆ గురువులే కట్టు తప్పుతున్న దారుణం మరోసారి ఆవిష్కృతమైంది. ఓ యువకుడైన విద్యార్థిపై కామంతో కళ్లు మూసుకుపోయి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఆ కీచక ప్రిన్సిపాల్ అంగాన్ని కొరికి తప్పించుకున్న ఘోరం నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ (Kollapur) లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. కొల్లాపూర్ పీజీ కళాశాలలో ఎంబీఏ పూర్తి చేసుకున్న ఓ విద్యార్థి మంగళవారం టీసీ కోసం కాలేజ్ వచ్చాడు. అయితే ప్రిన్సిపాల్ తనను లైంగికంగా సహకరించాలని ఒత్తిడి చేశాడు. గతంలో కూడా ఒకసారి సదరు యువకుడి పట్ల ఇలాగే వ్యవహరించిన ప్రిన్సిపాల్ మరోసారి తన అసహజ శృంగార కోరిక కోసం పట్టుబట్టాడు.

గతంలో సర్టిఫికేట్లు ఉండటంతో భయపడ్డ యువకుడు మరోసారి కీచకుడికి లొంగకూడదని నిశ్చయించుకున్నాడు. తోటి యువకులకు చెప్పాడు. రెడ్ హ్యాండెడ్ గా పట్టించేందుకు ప్లాన్ వేశాడు. ప్రిన్సిపాల్ అడిగినట్లుగా లైంగిక కోరిక తీర్చేందుకు ఒప్పుకున్నట్లు నటించి స్నేహితుల ద్వారా వీడియో తీయించాడు. ఈ క్రమంలో దారుణాన్ని తట్టుకోలేక, బాధతో దారుణానికి ఒడిగడుతున్న ప్రిన్సిపాల్ అంగాన్ని నోటితో కొరికాడు.

రక్త స్రావం అయిన ప్రిన్సిపాల్, అప్పటికే వీడియో చిత్రీకరణ గమనించి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ సంఘటనతో మంగళవారం రాత్రి కాలేజీలో ఉద్రిక్తత నెలకొంది. ఒక ప్రిన్సిపాల్ యువకుడైన ఒక విద్యార్థితో ఇలా వ్యవహరించడం సంచలనం కలిగించింది. ఈ సంఘటన ఉదయం బయటకు పొక్కింది. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు కాలేజీ వద్ద ఆందోళన చేపట్టాయి.

ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. ఈ విషయమై బాధిత విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. ప్రిన్సిపాల్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు నాగర్ కర్నూల్ జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం రిమాండ్ కు తరలించే ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>