Mobile Popup Ad
Mobile Popup Ad

దంపతులైనా సరే.. ఈ వస్తువులు మాత్రం అస్సలు పంచుకోవద్దు!

కలం, వెబ్ డెస్క్: దాంతప్య జీవితంలో భార్యాభర్తలు అన్నింటినీ పంచుకోవడం, ఒకరికొకరు తోడుగా నిలవడం సహజం. కొంతమంది ప్రేమ, ఆప్యాయతలతో పాటు నిత్య జీవితంలో వాడే వస్తువులను కూడా పంచుకుంటారు. అయితే, భార్యాభర్తలు ఎంత అన్యోన్యంగా ఉన్నా, ఆరోగ్యపరంగా కొన్ని వ్యక్తిగత వస్తువులను అస్సలు పంచుకోవద్దని (Hygiene Tips) చెబుతున్నారు వైద్య నిపుణులు.

సాధారణంగా భార్యభర్తలు కొన్ని పనులకు ఒకే వస్తువును ఉపయోగిస్తుంటారు. ఉదాహరణకు ఒకే సబ్బు వాడటం, ఒకే దువ్వెనతో దువ్వుకోవడం వంటివి. కొందరైతే ఏకంగా ఒకే టవల్ ఉపయోగిస్తారు. ఇప్పుడు ఒక ఆలోచన రావచ్చు. భార్యాభర్తలే కదా ఇద్దరూ ఒకే వస్తువు వాడడంలో తప్పేముంది అని.

కానీ ఒకే వస్తువును ఇద్దరు ఉపయోగించడం వలన ఒకరి నుంచి మరొకరికి బ్యాక్టీరియా, వైరస్ వంటి ఇన్ఫెక్షన్లు చాలా వేగంగా వ్యాపించే ప్రమాదం ఉందని చెబుతున్నారు వైద్యులు. అయితే దంపతులు పొరపాటున కూడా పంచుకోకూడని వస్తువులు ఏమిటి? వాటివల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. సబ్బు, లూఫా.. కొంత మంది దంపతులు ఒకరు వాడిన సబ్బు, లూఫా మరొకరు ఉపయోగిస్తారు. ఇలా ఉపయోగించడం వల్ల వాటిలో చేరిన మృతకణాలు, బ్యాక్టీరియా మరొకరి చర్మంపైకి చేరి, చర్మ సమస్యలు, ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఎవరి లూఫా వారే వాడలం మేలంటున్నారు. అంతే కాకుండా స్నానం చేసిన తర్వాత వాటిని సరైన పద్ధతిలో శుభ్రం చేసి ఆరబెట్టడం ముఖ్యం.

2. టవల్.. సహజంగానే భార్యాభర్తలిద్దరి చర్మ, కేశ సంరక్షణ అవసరాలు వేరువేరుగా ఉంటాయి. అందుకు తగ్గట్టుగానే వారు వాడే బ్యూటీ ప్రొడక్ట్స్, క్రీములు లేదా షాంపూలు కూడా వేర్వేరుగా ఉంటాయి. ఇలాంటప్పుడు ఇద్దరూ కలిసి ఒకే టవల్ వాడుకుంటే.. ఆ ఉత్పత్తుల రసాయన అవశేషాలు టవల్ ద్వారా ఒకరి నుంచి మరొకరి చర్మానికి సులభంగా వ్యాపించే ప్రమాదం ఉంటుంది. దీనివల్ల అలర్జీలు, మొటిమలు, ఇన్ఫెక్షన్లు వంటి చర్మ సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు నిపుణులు.

3. డియోడరెంట్లు, పెర్ఫ్యూమ్స్.. చాలా మంది సువాసనల కోసం డియోడరెంట్లు లేదా పెర్‌ఫ్యూమ్స్‌ను రోలర్ల (Roll-on deodorants) రూపంలో వాడుతుంటారు. అయితే దంపతులిద్దరూ ఒకే Roll-on deodorants ఉపయోగించడం వల్ల ఒకరి చర్మంపై ఉండే చెమట, మృతకణాలు మరొకరి చర్మంపైకి చేరతాయి. ఫలితంగా చర్మ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది.

4. దువ్వెన.. చాలా మంది భార్యభర్తలు ఒకే దువ్వెనను వాడుతుంటారు. ఒకే దువ్వెనతో దువ్వుకోవడం వల్ల చుండ్రు, పేల సమస్య, కుదుళ్ల ఇన్ఫెక్షన్లు వంటివి ఒకరి నుంచి మరొకరిని వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. అందుకే ఇంట్లో ఎవరికి వారు సెపరేట్ దువ్వెన పెట్టుకోవడం మంచిది.

5. ఒకే కర్చీఫ్​.. సాధారణంగా చెమట, ముఖంపై పేరుకుపోయిన దుమ్మును తుడుచుకోవడానికి కర్చీఫ్​ వాడుతుంటాం. అయితే భార్యాభర్తలిద్దరూ కలిసి ఒకే కర్చీఫ్​ ఉపయోగించడం అస్సలు మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు. ఒకరు వాడిన కర్చీఫ్​ ను మరొకరు వాడటం వలన, ఈ గుడ్డపై ఉండే ప్రమాదకర బ్యాక్టీరియా, క్రిములు చాలా సులభంగా ఒకరి చర్మం నుంచి మరొకరి చర్మానికి వ్యాపిస్తాయని చెబుతున్నారు. చర్మ సంరక్షణ, వ్యక్తిగత పరిశుభ్రత దృష్ట్యా ఎవరి కర్చీఫ్ వారే విడిగా ఉపయోగించుకోవడం ఎంతో ఉత్తమం.

6. బాత్రూమ్ స్లిప్పర్స్.. చాలామంది ఇళ్లల్లో బాత్రూమ్‌లో ఉపయోగించడానికి ప్రత్యేకంగా స్లిప్పర్స్ (చెప్పులు) ఉంచుతుంటారు. ఒకే స్లిప్పర్స్‌ను ఇద్దరూ వాడడం వల్ల ఆ ఫంగస్ ఒకరి పాదాల నుండి మరొకరి చర్మానికి వ్యాపించి.. పాదాల మధ్య దురద, ర్యాషెస్, గజ్జి లేదా తామర వంటి ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. అంతేకాదు, ఇద్దరి పాదాల కొలతలు వేర్వేరుగా ఉన్నప్పుడు, ఒకే చెప్పులను వాడడం వల్ల అవి వదులై బాత్రూమ్‌లో జారిపడే ప్రమాదం కూడా ఉంది. అందుకే సురక్షితమైన ఆరోగ్యానికి (Hygiene Tips), భద్రతకు ఎవరి బాత్రూమ్ చెప్పులు వారే విడిగా ధరించడం ఎంతో మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.

Read Also: స్వీట్లు తినడానికి సరైన సమయం ఏది? నిపుణులు చెప్పిన నిజాలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>