కలం, వెబ్ డెస్క్: తమిళనాడులోని (Tamil Nadu) తిరుపత్తూరులో మనసులను పిండేసే సంఘటన చోటుచేసుకుంది. ఓ యువతి తన ప్రియుడిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఇందుకుగాను తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే ప్రియుడితో కలిసి పోలీసులను ఆశ్రయించింది. తల్లిదండ్రులు ఎంతగానో బతిమిలాడినా వినిపించుకోలేదు. ప్రియుడితోనే వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో తల్లిదండ్రులు కూతురి కాళ్లు పట్టుకొని బతిమిలాడారు. చివరకు బోరున ఏడ్చినా వినిపించుకోలేదు.
ప్రేమ కోసం కన్నప్రేమను కాదంటూ నో చెప్పి వెళ్లిపోయింది. కన్న కూతురి కోసం తల్లిదండ్రులు కంటతడి పెట్టిన వీడియో ప్రతిఒక్కరినీ కదిలించింది. ఈ హృదయవిదారక దృశ్యాలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

