Mobile Popup Ad
Mobile Popup Ad

పేకాట స్థావరంపై పోలీసులు దాడి.. ఏడుగురు అరెస్ట్

కలం, నిర్మల్: పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి ఏడుగురిని అరెస్ట్ చేశారు. సోమవారం నిర్మల్ (Nirmal) జిల్లాలోని సారంగాపూర్ మండల కేంద్రంలోని త్రినేష్ దాబా వెనుక పేకాట ఆడుతున్న జూదరులు అరెస్ట్ అయ్యారు. ఎస్సై శ్రీకాంత్ వివరాలు వెల్లడించారు. పక్కా సమాచారం మేరకు దాడులు నిర్వహించి ఏడుగురు పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.10,440 నగదు, ఆరు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పేకాట, మట్కా లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై శ్రీకాంత్ హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>