Mobile Popup Ad
Mobile Popup Ad

ఔషధాల విక్రేతకు మూడేళ్ల జైలు శిక్ష

కలం, దమ్మ పేట: ఔషధాల విక్రయ నిబంధనలను ఉల్లంఘించిన కేసులో ఒక వ్యక్తికి మూడేళ్ల సాధారణ జైలు శిక్ష, రూ.10 వేలు జరిమానా విధిస్తూ దమ్మపేట (Dammapeta) జూనియర్ సివిల్ జడ్జి, జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ న్యాయమూర్తి బి.భవాని తీర్పునిచ్చారు. అశ్వారావుపేటకు చెందిన మార్తా పెద్దిరాజు అనే వ్యక్తి డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం-1940 నిబంధనలను ఉల్లంఘించి మందుల విక్రయాలు జరుపుతున్నట్లు జిల్లా డ్రగ్ ఇన్‌స్పెక్టర్ గుర్తించారు.

నేరం రుజువు కావడంతో..

ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితుడిని దమ్మపేట కోర్టులో హాజరుపరిచారు. విచారణ సందర్భంగా ప్రాసిక్యూషన్ తరఫున అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ హెచ్. శ్రీధర్ బలమైన వాదనలు వినిపించారు. నిందితుడు నిబంధనలను ఉల్లంఘించినట్లు తగిన సాక్ష్యాధారాలతో సహా నిరూపించారు. నేరం రుజువు కావడంతో నిందితుడు మార్తా పెద్దిరాజుకు శిక్ష విధిస్తూ జడ్జి తుది తీర్పు వెలువరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>