కలం, స్పోర్ట్స్: భారత టీ20 జట్టులో ఊహించని మార్పు చోటు చేసుకుంది. జూలై 23 నుండి 26 వరకు జింబాబ్వేతో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు సంజూ శాంసన్‌ను రీప్లేస్ చేస్తూ 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని (Vaibhav Suryavanshi ) సెలక్టర్లు జట్టులోకి తీసుకున్నారు. ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20లోనే సంజూను పక్కన పెట్టి వైభవ్‌కు తుది జట్టులో అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఏకంగా జింబాబ్వే సిరీస్ నుంచి కూడా సంజూను పూర్తిగా తొలగించి, ఆ స్థానాన్ని వైభవ్‌తో భర్తీ చేశారు.
ఈ పర్యటనకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇషాన్ కిషన్ ప్రధాన వికెట్ కీపర్‌గా జట్టులో కొనసాగుతుండగా, బ్యాకప్ కీపర్‌గా ప్రభ్‌సిమ్రన్ సింగ్‌ను ఎంపిక చేశారు. యువ పేసర్లు అశోక్ శర్మ, మయాంక్ యాదవ్‌లకు కూడా ఈ సిరీస్‌లో చోటు దక్కింది. మరోవైపు ఇంగ్లాండ్‌తో జరిగే వన్డే సిరీస్ జట్టులోనూ ఒక కీలక మార్పు జరిగింది. గాయపడిన నితీష్ కుమార్ రెడ్డి స్థానంలో ఆల్‌రౌండర్ శివమ్ దూబేను వన్డే జట్టులోకి తీసుకుంటున్నట్లు సెలక్షన్ కమిటీ వెల్లడించింది.
జింబాబ్వే సిరీస్‌కు భారత టీ20 జట్టు
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, రింకూ సింగ్, హర్ష్ దూబే, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్, యష్ ఠాకూర్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్, ప్రభ్‌సిమ్రన్ సింగ్ (వికెట్ కీపర్).

