కలం, హనుమకొండ: కాజీపేట రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం విషాద ఘటన (Kazipet Tragedy) చోటుచేసుకుంది. హనుమకొండ (Hanumakonda) రిజిస్ట్రేషన్ కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్‌గా పనిచేస్తున్న రాజేష్ నాయక్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం ప్రకారం, ఆత్మహత్యకు ముందు రాజేష్ నాయక్ తన భార్యకు వీడియో కాల్ చేశారు. కాల్‌లో మాట్లాడిన అనంతరం తీవ్ర మనస్తాపంతో కాజిపేట రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.
కుటుంబ కలహాల నేపథ్యంలో రాజేష్ నాయక్ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. స్థానికులు వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

