Mobile Popup Ad
Mobile Popup Ad

ప్రజా పోరాటాల్లో చురుకైన పాత్ర పోషించిన వ్యక్తి వెంకన్న: చాడ

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం గాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన సిపిఐ సీనియర్ నాయకుడు దొంతరవేని వెంకన్న (CPI Leader Dontharaveni Venkanna) కమ్యూనిస్టు పార్టీకి అంకిత భావంతో పనిచేస్తూ విధేయుడుగా, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే పోరాటాల్లో చురుకైన పాత్ర పోషించేవాడాని సిపిఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి (Chada Venkat Reddy) కొనియాడారు. గత నాలుగు రోజుల క్రితం మృతి చెందిన వెంకన్న కుటుంబాన్ని చాడ వెంకటరెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ పరామర్శించారు.వెంకన్న చిత్ర పటానికి పూలమాల వేసి నివాళ్ళర్పించారు.

ఈ సందర్భంగా వెంకటరెడ్డి (Chada Venkat Reddy) మాట్లాడుతూ.. వెంకన్న పార్టీ పట్ల,సైద్ధాంతిక అవగాహన కలిగించుకొని మండలంలో, గ్రామంలో సీపీఐ బలోపేతం కోసం కృషి చేశాడని అన్నారు. గ్రామ శాఖ కార్యదర్శిగా, జిల్లా కౌన్సిల్ సభ్యులుగా పార్టీ అప్పగించిన పనిని తూ.చా. తప్పకుండా అమలు చేసేవాడని కొనియాడారు. నిరంతరం పార్టీ బలోపేతం కోసం పనిచేసిన గొప్ప వ్యక్తి వెంకన్న అని.. నీతి నిజాయితీగా, అంకిత భావంతో ఉండేవాడని, అలాంటి నాయకుడు మృతి చెందడం అత్యంత బాధాకరమని చెప్పారు. వెంకన్న మృతి సీపీఐకి తీరని లోటు అని, వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని వెంకటరెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అందె స్వామి, మండల కార్యదర్శి నాగెల్లి లక్ష్మారెడ్డి, తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కాంతాల శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు తెరాల సత్యనారాయణ, సీపీఐ మండల సహాయ కార్యదర్శి బూడిద సదాశివ, ముద్రకోల రాజయ్య, శాఖ కార్యదర్శులు మంద ఎల్లయ్య, ఎం.డి ఉస్మాన్ పాషా, ఎలగందుల రాజు, సీపీఐ మండల నాయకులు తాళ్ళపెల్లి చంద్రయ్య, బందెల శ్రీనివాస్, సింగిరెడ్డి బాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Read Also: పాలమూరు రైతుల సోలార్ ‘పంట‘.. నెలనెలా ఆదాయం

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>