కలం, వెబ్ డెస్క్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు (Harish Rao) నిత్యం రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉంటారు. అలాంటి నేత కొద్దిసేపు పాలిటిక్స్ పక్కన పెట్టి సోమవారం వినూత్న ఆటతో అలరించారు. తన ఆటతీరుతో యువతను ఫిదా చేశారు. చిన్నప్పుడు తాను ఎంతో యాక్టివ్‌గా ఆడిన ఒక సంప్రదాయ ఆటను ఆయన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రమంగా అంతరించిపోతున్న సంప్రదాయ ఆటలను పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు.
తాను ఆ ఆట ఆడుతున్న వీడియోను పోస్ట్ చేస్తూ.. ‘ఈ ఆట పేరు ఏంటో చెప్పగలరు? అలాగే మీ ప్రాంతంలో ఈ గేమ్‌ను ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి’ అంటూ నెటిజన్లను ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. నెటిజన్లు తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఉత్సాహంగా కామెంట్లు పెడుతున్నారు.
Read Also: తెలంగాణ టీ20లో మెరిసిన నిర్మల్ యువ క్రికెటర్
Follow Us On: Sharechat

