Mobile Popup Ad
Mobile Popup Ad

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం: ఎంప్లాయిస్ జేఏసీ

కలం, కరీంనగర్ బ్యూరో: టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షులు, ఎంప్లాయిస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్ (Maram Jagadeeshwar).. వ్యవసాయ మార్కెట్ (Karimnagar Market) కమిటీ కార్యాలయాన్ని సందర్శించి ఉద్యోగుల సమస్యలు, శాఖ పనితీరుపై సమీక్షించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న, పాలకమండలి సభ్యులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉద్యోగుల సంఘం ఆహ్వానం మేరకు అయన కార్యాలయాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా చైర్మన్ ఆకుల నరసన్న, పాలకమండలి సభ్యులు, ఉద్యోగులు రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కార్యదర్శి సంఘం లక్ష్మణరావు, కోశాధికారి ముప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి, సర్దార్ హరివీందర్ సింగ్ గూడ ప్రభాకర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు రాజేష్ భరద్వాజ్, పోలు కిషన్ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కోటా రామస్వామి తదితరులను ఘనంగా సన్మానించారు. అనంతరం టీఎన్జీవోస్ నాయకులు మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్నను శాలువా, పుష్పగుచ్ఛంతో సత్కరించి అభినందనలు తెలిపారు.

అనంతరం మారం జగదీశ్వర్ మాట్లాడుతూ.. రైతుల కష్టసుఖాలు తెలిసిన యువ నాయకుడు ఆకుల నరసన్న మార్కెట్ కమిటీ చైర్మన్‌గా నియమితులు కావడం అభినందనీయమని కొనియాడారు. ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. “దేశానికి వెన్నుముక రైతులైతే, రైతుకు వెన్నుముక వ్యవసాయ శాఖ. వ్యవసాయ శాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఉద్యోగ సంఘాలతో కలిసి నిరంతరం కృషి చేస్తాం” అని హామీ ఇచ్చారు.

మార్కెట్ (Karimnagar Market) కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ఉద్యోగుల సంక్షేమం కోసం నిరంతరం పోరాడుతున్న రాష్ట్ర జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, టీఎన్జీవోస్ నాయకులు తమ కార్యాలయానికి రావడం సంతోషంగా ఉందని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో ఉద్యోగుల సేవలు కీలకమని పేర్కొన్నారు.

టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. క్రమశిక్షణ, కమిట్‌మెంట్, సేవాభావం, రైతు పట్ల అంకితభావం కలిగిన నాయకుడు ఆకుల నరసన్న మార్కెట్ కమిటీ చైర్మన్‌గా నియమితులు కావడం రైతాంగానికి మేలు చేసే నిర్ణయమని అన్నారు. రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధికి ఆయన సమర్థ నాయకత్వం అందిస్తారనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి రమణ, కాజా, రాజు, లవ కుమార్, నారాయణ, అల్లే శ్రీనివాస్, కాంతయ్య, పవన్, మనోహర్, పాలకమండలి సభ్యులు, ఉద్యోగుల సంఘం నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Read Also: సంచలన రిపోర్ట్.. ఆ విషయంలో దేశంలోనే హైదరాబాద్ టాప్..!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>