Mobile Popup Ad
Mobile Popup Ad

‘లెనిన్’కు ఎన్టీఆర్ వాయిస్.. అఖిల్ సినిమాకు బిగ్ సర్‌ప్రైజ్

కలం, సినిమా : అఖిల్ అక్కినేని (Akhil Akkineni) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మాస్ అండ్ యాక్షన్ మూవీ ‘లెనిన్'(Lenin). ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి చిత్రయూనిట్ మరో క్రేజీ అప్‌డేట్ ఇచ్చింది. ఈ చిత్ర ప్రారంభంలో వచ్చే శ్రీరామపురం, భారతం మిట్ట ప్రపంచాన్ని పరిచయం చేసే ప్రత్యేక వాయిస్ ఓవర్‌ను మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR) అందించినట్లు అన్నపూర్ణ స్టూడియోస్ అధికారికంగా ప్రకటించింది.

“ఒక నమ్మకంతో పుట్టిన ప్రపంచం.. పరిచయం అవసరం లేని ఓ వాయిస్‌తో మీ ముందుకు వస్తోంది” అంటూ సోషల్ మీడియాలో పోస్టర్‌ను విడుదల చేసింది. దీంతో ఫ్యాన్స్‌లో ఈ  సినిమాపై మరింత హైప్‌ ఏర్పడింది. టాలెంటెడ్ డైరెక్టర్ మురళీ కిశోర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అఖిల్ సరసన క్యూట్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్‌గా నటిస్తోంది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్  థమన్ సంగీతం అందిస్తుండగా, అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ‘లెనిన్’ (Lenin) మూవీ జూలై 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది.

Read Also: ఇంట్లో ఇవి ఉంటే.. ఆరోగ్యం గోవిందే!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>