కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar)లో మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నేడు కరీంనగర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నగరంలోని మంచిర్యాల చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ మేడిపల్లి సత్యం హాజరయ్యారు.
ఈ క్రమంలోనే కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు, మున్సిపల్ కార్పొరేటర్ వైద్యుల అంజన్ కుమార్, మాజీ శాసనసభ్యులు ఆరెపల్లి మోహన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్పుల అంజన్ ప్రసాద్ తో పాటు పలువురు నాయకులతో కలిసి జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం (Medipally Satyam) మాట్లాడుతూ.. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, సంఘ సంస్కర్త జగ్జీవన్ రామ్ ఈ దేశానికి మాజీ ఉప ప్రధానిగా, అనేక మంత్రిత్వ శాఖలకు మంత్రిగా పనిచేసి ఈ దేశ అభివృద్ధి కోసం, ముఖ్యంగా అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడ్డారని కొనియాడారు.
ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో రక్షణ శాఖ మంత్రిగా ఉండి ఆ రోజు 1971లో ఇండో – పాక్ యుద్ధం జరిగినప్పుడు మన దేశం గెలవడానికి అనేక విధంగా సహాయ సహకారాలు అందించినటువంటి గొప్ప నాయకుడు జగ్జీవన్ రామ్ అని ప్రశంసించారు. జీవించినంత కాలం ఈ దేశం కోసం, దళిత జాతి కోసం, అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం పాటుపడిన వ్యక్తికి ఈరోజు వర్ధంతి అని.. ఈ క్రమంలోనే ఆయనకు యావత్ కాంగ్రెస్ పార్టీ అంతా కూడా ఘనంగా నివాళులు అర్పిస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో నాయకులు ఉప్పుల అంజనీ ప్రసాద్, వెన్న రాజ మల్లయ్య, సురేందర్ రెడ్డి, వంగల విద్యాసాగర్, కళ్ళపల్లి బాలరాజు, వెన్నం రజిత రెడ్డి, ఫహద్, కంకణాల అనిల్ కుమార్, మనోజ్, మాదాసు శ్రీనివాస్, జీడి రమేష్, ఇమ్రాన్, జూపాక సుదర్శన్, వీర దేవేందర్, ఇమ్రాన్ ఘని, సుంకరి గణపతి, సరిల్లా రతన్ రాజు, సత్తినేని శ్రీకాంత్, కిరణ్ రెడ్డి, షబానా మహమ్మద్ అనీఫ్, ఇమామ్, మాలోతు మహాలక్ష్మి, బషీరుద్దీన్, పాషా, శిల్ప, పెంట శేఖర్, కర్రె శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
మరోవైపు బాబూ జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్, కరీంనగర్ 27వ డివిజన్ కార్పొరేటర్ బోట్ల శ్యామల – తంగేళ్ల కిరణ్ కుమార్ లు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. నాయకులు మాట్లాడుతూ.. దేశానికి బాబు జగ్జీవన్ రామ్ చేసిన సేవలు అసాధారణమైనవని కొనియాడారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి, దేశంలో సామాజిక సమానత్వం కోసం ఆయన జీవితాంతం కృషి చేశారని గుర్తుచేశారు. స్వతంత్ర సమరయోధుడిగా, కేంద్ర మంత్రిగా, ఉప ప్రధానిగా ఆయన అందించిన సేవలు రాబోయే తరాలకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా ఉంటాయని పేర్కొన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని పిలుపునిచ్చారు.
Read Also: సంచలన రిపోర్ట్.. ఆ విషయంలో దేశంలోనే హైదరాబాద్ టాప్..!
Follow Us On : WhatsApp

