Mobile Popup Ad
Mobile Popup Ad

ఇందిరమ్మ ఇండ్లు పేదలకు వరం: చండూరు మున్సిపల్ చైర్మన్

కలం, చండూరు: ఇందిరమ్మ ఇండ్ల (Indiramma Indlu) పథకం పేదలకు వరం లాంటిదని, ఈ పథకంతోనే పేదల సొంతింటి కల నెరవేరిందని చండూరు మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు అన్నారు. ఆదివారం చండూరు మున్సిపాలిటీలోని 8వ వార్డుకు చెందిన గండూరి నగేశ్ నూతన ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడారు. పేదల కలను నెరవేర్చే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం ఎన్నో కుటుంబాలకు సంతోషాన్ని అందిస్తుందన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు పేదల సంక్షేమం కోసం కృషి చేస్తుందన్నారు. అనంతరం గండూరి నగేశ్ దంపతులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ భూతరాజు దశరథ, కౌన్సిల్ సభ్యులు బుషిపాక వాసు, కో-ఆప్షన్ సభ్యులు కల్లెట్ల చంద్రకళ మారయ్య, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఐతరాజు మల్లేశ్ పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>