Mobile Popup Ad
Mobile Popup Ad

ఏంటీ.. ఈ ఫేమస్ తమిళ యాక్టర్ తెలుగు వాడా?

కలం, వెబ్ డెస్క్ : కాంచన సినిమాతో ఫేమస్ అయిన తమిళ నటుడు శ్రీమాన్ (Sriman).. అనిల్ రావిపూడి డైరెక్షన్ వస్తున్న తెలుగు సినిమాలో నటిస్తున్నాడు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో అనిల్ రావిపూడికి (Anil Ravipudi) థ్యాంక్స్ చెబుతూ వీడియో రిలీజ్ చేశాడు. ఎన్నో ఏళ్లుగా తమిళ సినిమాలో నటించిన తనకు ఎట్టకేలకు తెలుగులో అవకాశం రావడంపై హర్షం వ్యక్తం చేశారు. తాను తెలుగు వ్యక్తిని అని చెప్పాడు. తమిళంలో వచ్చిన చాలా సినిమాలకు తెలుగులో డబ్బింగ్ చెప్పుకున్నట్లు వెల్లడించారు. ఇప్పుడు తన మాతృభాష తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేస్తున్నట్లు శ్రీమాన్ సంతోషం వ్యక్తం చేశాడు.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, కల్యాణ్ రామ్ నటించే ఎంటర్‌టైనర్ చిత్రంలో భాగం అవుతున్నట్లు ఆయన వెల్లడించారు. ‘తెలుగులో స్ట్రెయిట్ ఫిల్మ్ చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఒక వారం షూటింగ్ పూర్తయింది. నా మాతృభాషలో నటించడం నమ్మలేకపోతున్నా. సెట్ పూర్తి పాజిటివ్ ఎనర్జీతో వర్క్ చేస్తుంది. నన్ను ఆశీర్వదించండి’ అంటూ రాసుకొచ్చారు. దాదాపు 6 నిమిషాల వీడియోలో షూటింగ్ జ్ఞాపకాలు, సెట్ అనుభవాలను పంచుకున్నారు. కాగా, కాంచన సిరీస్‌తో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన శ్రీమాన్ (Sriman) తెలుగు మూలాలు ఉన్నప్పటికీ తమిళ సినిమాల్లో ఎక్కువగా నటించారు.

Read Also: ప్రభాస్ ‘ఫౌజీ’ రిలీజ్ డేట్ ఫిక్స్..?

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>