Mobile Popup Ad
Mobile Popup Ad

‘భార్యను బొందపెట్టడం ఎలా?’.. మెట్రోలో పుస్తకాల యుద్ధం!

కలం, వెబ్ డెస్క్ : ఇంటర్నెట్ ప్రపంచంలో ఎప్పుడు ఏది ట్రెండ్ అవుతుందో ఊహించడం కష్టం. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఒకదానికి ఒకటి పోటీగా సాగే ‘జెండర్ వార్స్’ నెటిజన్లకు మంచి వినోదాన్ని పంచుతుంటాయి. ఇటీవల ఓ మెట్రో రైలులో ప్రయాణిస్తున్న యువతి ‘మగాళ్లను చంపి తప్పించుకోవడం ఎలా?’ (How To Kill Men and Get Away With It) అనే పేరుతో ఉన్న పుస్తకాన్ని (Metro Train Viral Book) చదవడం తీవ్ర చర్చనీయాంశమైంది.

దీనికి సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్ కావడంతో, నెటిజన్లు దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. కొందరు దీనిని కేవలం ఒక డార్క్ హ్యూమర్ పుస్తకంగా కొట్టిపారేస్తే, మరికొందరు మాత్రం ఇలాంటి పుస్తకాలను బహిరంగంగా చదవడం ఏంటని అభ్యంతరం వ్యక్తం చేశారు.

అయితే, ఈ వైరల్ ఘటనకు తాజాగా ఒక ఊహించని కౌంటర్ దొరికింది. సోషల్ మీడియాలో ప్రస్తుతం మరో వీడియో హల్‌చల్ చేస్తోంది. అదే మెట్రో రైలులో ఓ వ్యక్తి ‘భార్యను బొందపెట్టడం ఎలా?’ అనే తెలుగు టైటిల్‌తో ఉన్న పుస్తకాన్ని (Metro Train Viral Book) చదువుతూ కనిపించాడు. ఆ యువతి పుస్తకానికి కౌంటర్‌గా ఈ వ్యక్తి కావాలనే ఈ పుస్తకాన్ని పట్టుకుని కూర్చున్నాడా, లేక ఇది ఎడిట్ చేసిన ఫోటోనా అనే విషయం పక్కన పెడితే, నెటిజన్లకు మాత్రం ఇది ఒక రేంజ్ వినోదాన్ని అందిస్తోంది.

ఈ ఫోటో చూసిన నెటిజన్లు ‘కౌంటర్ అంటే ఇలా ఉండాలి’ అంటూ కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. ఒకరిని మించిన వారు ఇంకొకరు ఉన్నారంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘కౌంటర్ అంటే ఇలా ఉండాలి మరి’ అంటూ కొందరు పురుషులు సంబరపడుతుంటే, ఇవన్నీ కేవలం అటెన్షన్ కోసమే చేస్తున్న పనులంటూ మరికొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి మెట్రో రైలు ప్రయాణాల్లో జరుగుతున్న ఈ పుస్తకాల యుద్ధం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>