Mobile Popup Ad
Mobile Popup Ad

ఆటగాడిగా కాకపోయినా.. అభిమానిగా క్రికెట్‌తోనే ఉంటా: బెన్ స్టోక్స్

కలం, స్పోర్ట్స్: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes).. తాజాగా చేసిన ఎమోషనల్ పోస్ట్ అభిమానులను కదిలించింది. 15 ఏళ్ల తన క్రికెట్ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ అభిమానులు, సహచర ఆటగాళ్లు, కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఇంగ్లండ్-న్యూజిలాండ్ మూడో టెస్టు తర్వాత రిటైర్మెంట్ ప్రకటించిన స్టోక్స్.. ఆ నిర్ణయం పూర్తిగా తనదేనని చెప్పారు. కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసినా, ఇన్నేళ్లుగా తనకు అండగా నిలిచిన ప్రతి క్రికెట్ అభిమానిపై ప్రేమ, గౌరవం ఎప్పటికీ ఉంటాయని పేర్కొన్నారు. ఇకపై ఆటగాడిగా కాకుండా అభిమానిగా ఇంగ్లండ్ జట్టును ప్రోత్సహిస్తానని తెలిపారు.

35 ఏళ్ల స్టోక్స్.. 2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో అజేయ 84 పరుగులతో ఇంగ్లండ్‌కు తొలి ప్రపంచకప్ అందించారు. అదే ఏడాది యాషెస్‌లో హెడ్డింగ్్లే టెస్టులో అజేయ 135 పరుగులతో చరిత్ర సృష్టించారు. 2022 టీ20 ప్రపంచకప్ విజయంలోనూ కీలక పాత్ర పోషించారు. టెస్టు కెప్టెన్‌గా ‘బాజ్‌బాల్’ శైలికి నాయకత్వం వహించారు. 122 టెస్టులు, 114 వన్డేలు, 43 టీ20లు ఆడిన స్టోక్స్ (Ben Stokes).. 7 వేలకుపైగా టెస్టు పరుగులు, 200కుపైగా వికెట్లు సాధించి ఇంగ్లండ్ క్రికెట్‌లో చిరస్మరణీయ ఆల్‌రౌండర్‌గా తన ముద్ర వేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>