Mobile Popup Ad
Mobile Popup Ad

రేపు సీఎం సభ.. ఏర్పాట్లను పరిశీలించిన డీసీసీ అధ్యక్షులు

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: రేపు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిడ్జిల్ మండలానికి విచ్చేయనున్న సందర్భంగా, ముఖ్యమంత్రి సభ ఏర్పాట్లను జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ (Sanjeev Mudiraj), రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి పరిశీలించారు. జెడ్పిటీసీగా 20 సంవత్సరాల ప్రజా సేవ నుంచి ముఖ్యమంత్రి పదవి వరకు సీఎం రాజకీయ ప్రస్థానానికి గుర్తుగా నిర్వహించనున్న ఈ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ మేరకు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ నాయకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిథున్ రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షులు మినాజుద్దీన్, డీసీసీ ప్రధాన కార్యదర్శి బంగ్లా రవి, లీగల్ సెల్ వైస్ చైర్మన్ రాజేష్, మాజీ జెడ్పిటీసీ గౌస్ రబ్బానీ, యూత్ కాంగ్రెస్ నాయకురాలు సంధ్య , కాంగ్రెస్ నాయకులు వెంకటయ్య, వెంకటేశం, మిడ్జిల్ మండల నాయకులు హల్వాల్ రెడ్డి, తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>