Mobile Popup Ad
Mobile Popup Ad

దటీజ్ సమంత.. తల్లి కాబోతున్న తగ్గేదేలే!

కలం, వెబ్ డెస్క్: టాలీవుడ్ నటి సమంత రూత్ ప్రభు (Samantha) మరోసారి ఫిట్‌నెస్‌తో అభిమానులను ఆకట్టుకుంది. ఇటీవలే తాను గర్భవతిననే విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ మెటర్నిటీ బ్రేక్ తీసుకోబోతున్నట్లు వెల్లడించింది. తాజాగా సోషల్ మీడియాలో కొత్త వర్కవుట్ వీడియోను షేర్ చేశారు. బేబీ బంప్‌తో కనిపిస్తూనే ట్రైనర్ సహాయంతో వ్యాయామం చేయడం విశేషం. శరీర బరువును సమతుల్యం చేసుకుంటూ చేతులు, భుజాలు, వీపు, కాళ్ల కండరాలకు సంబంధించిన వ్యాయామాలు చేసింది. గర్భధారణ సమయంలోనూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆమె చూపిస్తున్న అంకితభావం నెటిజన్లను ఫిదా చేసింది.

ఇటీవల సమంత (Samantha) లీడ్ రోల్‌లో విడుదలైన యాక్షన్ కామెడీ డ్రామా చిత్రం ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన వసూళ్లను సాధిస్తూ ఈ చిత్రం ఇప్పటివరకు సుమారు రూ. 88.26 కోట్ల గ్రాస్‌ కలెక్షన్లను రాబట్టింది. టాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన మహిళా ప్రాధాన్యత కలిగిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. కెరీర్ పరంగా విజయాలు అందుకుంటూనే, వ్యక్తిగత జీవితంలోనూ మాతృత్వాన్ని ఆస్వాదించడానికి సిద్ధమవుతోంది సమంత.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>