epaper
Monday, March 2, 2026
epaper

గోవిందరాజ ఆలయ బంగారం గోల్‌మాల్‌పై టీటీడీ క్లారిటీ

కలం, వెబ్ డెస్క్: గోవిందరాజ స్వామివారి ఆలయ బంగారం గోల్‌మాల్ వార్తలు అవాస్తవమని టీటీడీ (TTD) అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కోనేటి సుబ్బరాజు(Koneti Subbaraju) అన్నారు. టీటీడీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గోవిందరాజ స్వామివారి(Govindaraja Swamy) విమాన ప్రాకార పనులు సవ్యంగా జరుగుతున్నాయని, అన్ని పనులు సీసీ కెమెరాల పర్యవేక్షణలో కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. ఒక్క గ్రాము బంగారం కూడా పక్కదారి పట్టే అవకాశం లేదని ఆయన చెప్పారు.

తిరుపతి గోవిందరాజ స్వామివారి ఆలయ విమాన గోపుర పనుల్లో భారీ స్థాయిలో గోల్ మాల్ జరిగిందని ఆరోపణలు వచ్చాయి. నిబంధనల ప్రకారం గోపురానికి తొమ్మిది పొరల స్వర్ణ తాపడం చేయాల్సి ఉండగా, కేవలం రెండు పొరలతోనే పని కానిచ్చేశారని విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో దాదాపు 50 కిలోల బంగారం (Gold) మాయమైందనే ఆరోపణలు వినిపించాయి. స్వర్ణ తాపడం పనులు జరుగుతున్న క్రమంలో అజాగ్రత్తగా వ్యవహరించడం వల్ల గోపురంపై ఉన్న సుమారు 30 పురాతన విగ్రహాలు దెబ్బతిన్నాయని వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో గోవిందరాజ ఆలయ బంగారం గోల్‌మాల్ వార్తలు అవాస్తవమని టీటీడీ(TTD) అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కోనేటి సుబ్బరాజు అన్నారు.

Read Also: ఏపీలో సబ్‌ రిజిస్ట్రార్ల ఆస్తులపై ఏసీబీ ఫోకస్‌.. పలు చోట్ల తనిఖీలు

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!