Mobile Popup Ad
Mobile Popup Ad

యూజర్‌నేమ్ ఫీచర్‌ వివాదం.. టెలిగ్రామ్, సిగ్నల్‌లకు నోటీసులు

కలం, వెబ్ డెస్క్ : వాట్సాప్‌లో ప్రతిపాదించిన యూజర్‌నేమ్ ఫీచర్‌ (Username Feature )పై భారత ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. యూజర్‌నేమ్‌ వ్యవస్థ వల్ల వ్యక్తుల ఆన్ లైన్ మోసాలు, సైబర్ నేరాలు ప్రమాదాలు విపరీతంగా పెరుగుతాయని కేంద్రం భావిస్తోంది. దీంతో ఈ ఫీచర్ ను వెంటను అమలు చేయకూడదని, దీనిపై 3 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని వాట్సాప్ మాతృ సంస్థ మెటాకు నోటీసులు జారీ చేసిన కేంద్రం.. తాజాగా టెలిగ్రామ్, సిగ్నల్ యాప్‌లకు కూడా నోటీసులు పంపింది.

ఇప్పటికే టెలిగ్రామ్, సిగ్నల్ సంస్థలు యూజర్‌నేమ్ అధారిత ఫీచర్ వ్యవస్థను ఉపయోగిస్తున్నాయి. దీంతో యూజర్‌నేమ్‌ల వల్ల వచ్చే మోసాలు, దుర్వినియోగాన్ని అడ్డుకోవడంలో ఎలాంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని ఆయా సంస్థలను కేంద్రం కోరింది. ముఖ్యంగా ఈ యూజర్‌నేమ్‌ ఫీచర్‌ను ఎందుకు కొనసాగించాలో సరైన కారణాలు చెప్పాలని టెలిగ్రామ్ ప్లాట్‌ఫామ్‌ ను ప్రశ్నించింది. ఈ ఫీచర్ దుర్వినియోగం కాకుండా ఉన్న సేఫ్‌గార్డ్స్ పై సమాధానం ఇవ్వాలని సిగ్నల్ సంస్థను కోరింది. కాగా, నీట్ పరీక్ష పత్రాల లీకేజీ వ్యవహారంలో టెలిగ్రామ్ ప్లాట్‌ఫామ్‌ పై కేంద్రం విధించిన తాత్కాలిక నిషేధం ఇటీవలే ముగిసిన నేపథ్యంలో ఆ సంస్థకు తాజా నోటీసులు పంపడం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>