కలం, యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట (Yadagirigutta) పుణ్యక్షేత్రంలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో హుండీ కానుకలను లెక్కించారు. 28 రోజుల హుండీ ఆదాయం కొండ కింద ఆధ్యాత్మిక వాడలోని సత్యనారాయణ స్వామి వ్రతమండపం హాల్-2లో నిర్వహించారు. స్వామివారి 28 రోజుల హుండీ ఆదాయం మొత్తం నగదు రూ. 2,78,13,079. బంగారం 708 గ్రాములు, వెండి 003-150-000 కిలోల గ్రాములుగా లెక్కించారు. వివిధ దేశాల విదేశీ కరెన్సీని కూడా భక్తులు స్వామివారికి సమర్పించారు.
ఇందులో అత్యధికంగా 750 అమెరికా డాలర్లు, ఇంగ్లాండ్ 20 పౌండ్స్, కెనడా 50 పౌండ్స్, దిరామ్స్ 98, నేపాల్ 10, ఆస్ట్రేలియా 35, శ్రీలంక 50, మలేషియా 14, థాయిలాండ్ 380, సింగపూర్ 2, కంబోడియా 500, సౌదీ అరేబియా 1, ఖతార్ 10, న్యూజిలాండ్ 5, యూరో 5, ఫిలిప్పీన్స్ 50 ఆదాయం సమాకూరినట్లు ఆలయ కార్యనిర్వాహణధికారి భవాని శంకర్ శర్మ తెలిపారు.

