Mobile Popup Ad
Mobile Popup Ad

పాఠశాలలను కుదించవద్దు: టీఎస్‌యూటీఎఫ్ డిమాండ్

కలం, ఖమ్మం బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల సంఖ్యను కుదించాలనే ఆలోచనను వెంటనే విరమించుకోవాలని టీఎస్‌యూటీఎఫ్ ఖమ్మం (Khammam)  జిల్లా కార్యదర్శి డీఎస్.నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. అలాగే ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రెండో పీఆర్సీ తక్షణమే అమలు చేయాలన్నారు. గురువారం ఏనుకూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో యూటీఎఫ్ సభ్యత్వ క్యాంపెయిన్‌ను ప్రారంభించారు.

​ఈ సందర్భంగా డీఎస్.నాగేశ్వరరావు మాట్లాడుతూ.. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మూసివేసిన ప్రతి పాఠశాలను తిరిగి తెరిపిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అందుకు భిన్నంగా పాఠశాలల సంఖ్యను కుదించాలని చూడటం ఎంతమాత్రం సమంజసం కాదన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో, ఆరు డీఏలను వెంటనే విడుదల చేయాలన్నారు. మార్చి 2024 నుంచి రిటైర్డ్ అయిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన బెనిఫిట్స్‌, పెండింగ్ బిల్లులను తక్షణమే క్లియర్ చేయాలని డిమాండ్ చేశారు.

నగదు రహిత వైద్యం అందించాలి..

​హెల్త్ కార్డుల విధివిధానాలను సక్రమంగా రూపొందించి నగదు రహిత వైద్యం అందేలా చూడాలని డీఎస్.నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న పండిట్స్, పీఈటీ పోస్టులను అప్‌గ్రేడ్ చేస్తూ వారికి పదోన్నతులు కల్పించాలని కోరారు. మోడల్ స్కూల్స్, కేజీబీవీ, యూఆర్ఎస్ సీఆర్‌టీల సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని కోరారు. ​ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.రామ్‌చంద్, మూడ్ పుల్లయ్య, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>