Mobile Popup Ad
Mobile Popup Ad

కలెక్టర్ సత్య శారద, సీపీ శ్వేత భేటీ.. ప్రజా భద్రతపై చర్చ

కలం, వరంగల్: వరంగల్ (Warangal) జిల్లా కలెక్టర్ సత్య శారద (Collector Satya Sharada) గురువారం వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత (CP Swetha) ను కమిషనరేట్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్‌కు పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజా సమస్యల సత్వర పరిష్కారం, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల సమర్థవంతమైన అమలుపై విస్తృతంగా చర్చించారు.

పోలీసు, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాల్సిన అవసరాన్ని ఇరువురు అధికారులు ప్రస్తావించారు. అదేవిధంగా రానున్న పండుగలు, ప్రత్యేక ప్రభుత్వ కార్యక్రమాలు ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన ముందస్తు భద్రతా చర్యలు, ట్రాఫిక్ నిర్వహణ, శాంతిభద్రతల అంశాలపై పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>