కలం, సినిమా : దర్శక ధీరుడు రాజమౌళికి (Rajamouli) ఫ్రాన్స్‌లోని (France) లియోన్ నగరంలో ఉన్న ‘ఇన్‌స్టిట్యూట్ లూమియర్'(Institut Lumière) అరుదైన గౌరవం అందించింది. లూమియర్ మ్యూజియాన్ని సందర్శించిన రాజమౌళి, అక్కడ ‘ఈగ’, ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాలను ప్రదర్శించిన స్క్రీనింగ్ హాల్‌ను సందర్శించారు. అనంతరం సంస్థ డైరెక్టర్, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ డైరెక్టర్ థియెరీ ఫ్రేమో రాజమౌళిని సినిమా పుట్టిన వీధికి తీసుకెళ్లి ప్రత్యేక సర్‌ప్రైజ్ ఇచ్చారు.
అక్కడ ప్రపంచ సినీ దిగ్గజాలు మార్టిన్ స్కోర్సెసీ, క్లింట్ ఈస్ట్‌వుడ్, క్వెంటిన్ టరంటినో, ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా పేర్లతో పాటు ‘Mur des Cinéastes'(వాల్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్) గోడపై రాజమౌళి పేరు శాశ్వతంగా చెక్కిన ఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ గౌరవంపై స్పందించిన రాజమౌళి (Rajamouli), “ఈ అరుదైన గుర్తింపుకు మాటలు రావడం లేదు. జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాన్ని అందించిన ఇన్‌స్టిట్యూట్ లూమియర్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు” అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
Read Also: తెలంగాణ గద్దెపై పాలమూరు బిడ్డ.. రాజకీయ జన్మకు మిడ్జిల్ అడ్డా
Follow Us On : WhatsApp

